ప్రభాస్ అభిమానులకు ఓ శుభవార్త. రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న “రాధే శ్యామ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. 2019 నుంచి సెట్స్‌పై ఉన్న “రాధేశ్యామ్” విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిక్ పాన్ ఇండియా పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ ను జనవరి 14న పెద్ద స్క్రీన్‌పై చూడబోతున్నారు. ప్రమోషన్ స్ట్రాటజీలో భాగంగా టీమ్ ఇప్పుడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వేదికను ఖరారు చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నెల 23న హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహిస్తోంది. చాలా గ్యాప్ తరువాత ఎట్టకేలకు అభిమానులు తమ అభిమాన హీరోను వేదికపై చూడబోతున్నారు. ఈ వేదికపైనే ట్రైలర్ కూడా విడుదల కానుందని అంటున్నారు.
Read Also : అంత ధైర్యం ఎవరికి ఉంది… నేను రెడీ !
ఇక “రాధే శ్యామ్” టీమ్ ఇప్పటికే కొన్ని పాటలను విడుదల చేయగా వాటికి మంచి స్పందనే వచ్చింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీత దర్శకుడు. హిందీలో ‘ఆషికీ 2’ ఫేమ్ మిథూన్ సంగీత దర్శకుడిగా బాధ్యతలు తీసుకున్నారు. నెక్స్ట్ ఈ మూవీ నుంచి రానున్న సింగిల్ “సంచారి” ఒకేసారి నాలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సాంగ్ కు సంబంధించి హిందీ, సౌత్ ఇండియన్ భాషల్లో నేపథ్య సంగీతం విభిన్నంగా ఉండబోతోందని దర్శకుడు రాధ పేర్కొన్నారు. మరి అది ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.