చాలా కాలంగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా రొమాంటిక్ ఎంటర్టైనర్ “రాధే శ్యామ్” త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉండగా, ఇప్పుడు మేకర్స్ దీనిని మరో మెట్టు పైకి తీసుకువెళుతున్నారు. ఎందుకంటే ‘రాధే శ్యామ్’ ప్రపంచంలో మెటావర్స్ రూపంలో ఎవరికీ వారే స్వంత అవతారాలను సృష్టించే అవకాశాన్ని ప్రజలకు అందిస్తున్న మొదటి చిత్రంగా ఈ మూవీ నిలిచింది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సినిమా “రాధేశ్యామ్” కావడం విశేషం. మొత్తం 1.5 లక్షల మంది వినియోగదారులు ఇప్పటికే ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారు.
Read Also : Rana : నువ్వు చేస్తోంది యాక్టింగా… 4 గంటలు క్లాస్ పీకాడు సూర్య
ఇక ఈ బహుభాషా ప్రేమకథ 1970లలో యూరప్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా హస్తసాముద్రికుడి పాత్రలో కనిపించనున్నాడు. ప్రభాస్, పూజా హెగ్డే మధ్య కెమిస్ట్రీ సినిమాకి మ్యాజికల్ టచ్. టి సిరీస్ సమర్పణలో యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ‘రాధే శ్యామ్’ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ నిర్మించారు. “రాధేశ్యామ్” మార్చి 11న విడుదల కానుంది.