ప్రభాస్ తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ సంక్రాంతి విడుదలకు సన్నాహాలు జరుపుకుంటోంది. ఈ సినిమా టీజర్ అభిమానులలో భారీ అంచనాలకు తెరలేపింది. ఇందులో ప్రభాస్ పాతకాలపు ప్రసిద్ధ పామిస్ట్‌గా పరిచయం అయ్యాడు. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వాస్తవానికి నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే దానికి పూర్తిగా కమర్షియల్ హంగులు జోడించి తీసినట్లు వినికిడి. 20వ శతాబ్దానికి చెందిన ప్రముఖ ఐరిష్ హస్తసాముద్రికకారుడు చెయిరో జీవితం స్ఫూర్తితో దీనిని తీశారట. చెయిరోగా…