Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajinikanth Gift: కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ 173వ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు ‘ధర్మన్ – ది డెడ్లీ డాక్టర్’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రజనీకాంత్‌ను ‘ది డెడ్లీ డాక్టర్’గా చూపించబోతుండగా.. ఆయన మాస్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సూపర్ స్టార్ అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా సెట్స్ నుంచి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘ధర్మన్’ షూటింగ్లో పాల్గొంటున్న రాశీ ఖన్నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చినట్లు ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
రజనీకాంత్ నుంచి అందుకున్న ఈ ప్రత్యేక గిఫ్ట్‌కి సంబంధించిన విషయాన్ని రాశీ ఖన్నా అభిమానులతో పంచుకున్నారు. తలైవా తన చేతుల మీదుగా రాశీకి హిమాలయన్ బుక్ (Himalayan Book)ను బహుమతిగా అందించారు. ఈ స్పెషల్ గిఫ్ట్‌పై రాశీ ఖన్నా ఎంతో సంతోషంగా వ్యక్తం చేశారు. రజనీకాంత్ నుంచి బహుమతిగా పుస్తకం అందుకోవడం తనకు ప్రత్యేకమైన అనుభూతిగా నిలిచిందని ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ నటించనుండగా, యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. 2027 సమ్మర్లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
Also Read
తాజావార్తలు
-
Rajinikanth Gift: రాశీకి సూపర్ స్టార్ ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్.. ఎమోషనల్ అయిన హీరోయిన్!
-
SL Vs PAK: 64 బంతుల్లో విధ్వంసం.. ఎవరూ ఊహించని రేంజ్ క్లైమాక్స్..
-
Delhi: ఐబీ ఉద్యోగి అంకిత్ శర్మ హత్య కేసులో సంచలన తీర్పు.. మాజీ ఆప్ నేత తాహిర్ హుస్సేన్‌కు జీవిత ఖైదు
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Ramayana : సీతగా సాయి పల్లవి కన్నా అందంగా శూర్పణఖ రకుల్ ప్రీత్ సింగ్.. అసలు నిజం ఇదా?
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!