Site icon NTV Telugu

Pawan Kalyan: స్టార్ హీరోయిన్’ను రాజకీయాల్లోకి రమ్మన్న పవన్ కల్యాణ్

Deputy Cm Pawan Kalyan

Deputy Cm Pawan Kalyan

పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాలు చేస్తూనే సినిమాల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి ఆయన జనసేన పార్టీ అధినేతగా వ్యవహరిస్తూనే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే మరోపక్క గతంలో ఒప్పుకున్న సినిమాలను కూడా ఆయన పూర్తి చేస్తూ వస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే ఆయన ఒక స్టార్ హీరోయిన్‌కి రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చినట్లుగా సదరు హీరోయిన్ చెప్పుకొచ్చారు. ఆ హీరోయిన్ ఇంకెవరో కాదు, తెలుగులో ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి, ప్రస్తుతానికి బాలీవుడ్ సహా తమిళ సినీ పరిశ్రమలో పలు సినిమాలు చేస్తూ వస్తున్న రాశీ ఖన్నా.

Also Read:Ustaad Bhagat Singh : ఉస్తాద్ ఈవెంట్ కు తమన్ & దేవి శ్రీ డుమ్మా.. కావాలనే రాలేదా

ఆమె ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో హీరోయిన్‌గా నటించింది. తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె, పవన్ కళ్యాణ్‌తో ఉన్న స్వీట్ మూమెంట్స్ పంచుకుంటూనే, పవన్ కళ్యాణ్ తనకు రాజకీయాల్లోకి రమ్మని సలహా ఇచ్చినట్లు చెప్పుకొచ్చింది. అసలు విషయం ఏమిటంటే, ఒకానొక సందర్భంలో పవన్ కళ్యాణ్‌తో మాట్లాడుతుండగా.. ఆయన “మీరు సినిమాల్లోకి రావాలని అనుకున్నారా? లేక నటనలోకి రాకముందు వేరే ఏమైనా అవ్వాలనుకున్నారా?” అని ప్రశ్నించగా, దానికి ఆమె తాను ఐఏఎస్ అవ్వాలని అనుకున్నానని, కానీ అది కుదరక ఇలా సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే పవన్ “అయితే ఐఏఎస్ అవ్వడం కుదరని పక్షంలో రాజకీయాల్లోకి రావచ్చు కదా, అలా అయినా ప్రజలకు సేవ చేయొచ్చు కదా” అని సలహా ఇచ్చారట. దానికి రాశీ వెంటనే పాలిటిక్స్ తన వల్ల కాదని చెప్పినట్లు చెప్పుకొచ్చింది.

Exit mobile version