Raakshasa Kaavyam Villians Anthem: నవీన్ బేతిగంటి, అన్వేష్ మైఖేల్, పవన్ రమేష్, దయానంద్ రెడ్డి, కుశాలిని, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా “రాక్షస కావ్యం”. గరుడ ప్రొడక్షన్స్, పింగో పిక్చర్స్, సినీ వ్యాలీ మూవీస్ బ్యానర్స్ లో దాము రెడ్డి, శింగనమల కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకి నవీన్ రెడ్డి, వసుంధర దేవి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఉమేష్ చిక్కు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ “రాక్షస కావ్యం” సినిమాను దర్శకుడు శ్రీమాన్ కీర్తి డైరెక్ట్ చేశారు. రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా నుంచి సోమవారం విలన్స్ ఆంథెమ్ ను రిలీజ్ చేశారు. కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించిన ఈ సాంగ్ కు ఆర్.ఆర్ ద్రువన్ ట్యూన్ కంపోజ్ చేయగా ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ముగ్గురు టాప్ సింగర్స్ రాహుల్ సిప్లిగంజ్, రామ్ మిరియాల, మంగ్లీ పాడారు.
Urvashi: నా భర్తనే నా చేత బలవంతంగా తాగించి.. తాగుబోతును చేశాడు
డీలో డిల్లెలో డీలో డిల్లెలో హీరో ఎవడు విలన్ ఎవడు జిందగీలో, డీలో డిల్లెలో డీలో డిల్లెలో, సెడ్డోడెవడు మంచోడెవడు బోలో బోలో…అంటూ మనుషుల వ్యక్తిత్వాలను ప్రశ్నిస్తూ అర్థవంతమైన లిరిక్స్ తో ఈ పాట సాగుతూ ఉండడం గమనార్హం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే విలన్స్ గురించి ప్రత్యేకంగా ఈ పాటను డిజైన్ చేయడం. మైథాలజీని నేటి సామాజిక పరిస్థితులకు అన్వయించి తెరకెక్కించిన ఒక కొత్త తరహా సినిమాగా “రాక్షస కావ్యం” ప్రేక్షకుల ముందుకు రాబోతోందని మేకర్స్ చెబుతున్నారు. త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. రోహిణి, యాదమ్మ రాజు, శివరాత్రి రాజు, ప్రవీణ్ దాచరం, కోట సందీప్, విజయ్ అంబయ్య, వినయ్ కుమార్ పర్రి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ – రుషి కోనాపురం అందిస్తుండగా సంగీతం – రాజీవ్ రాజ్ అందిస్తున్నారు.