PushpaRaj fever In world Cup warm-up match:ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా కోసం ప్రేక్షకులంతా వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారన్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ పుష్ప సినిమా మొదటి భాగం సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. బన్నీ మాస్ గెటప్‌కు ఆయన యాక్షన్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యి ఆయన మేనరిజమ్స్ కూడా చేసేస్తూ ఉంటారు. సినిమా మొదటి భాగం భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇదిలా ఉంటే ఆ అంచనాలు ఆకాశాన్ని అంటేలా ఈ సినిమా నుంచి అప్డేట్స్ కూడా వస్తూ ఉన్నాయి. లీకైన ఫోటోలు, వీడియోలు ఈ రేంజ్ లో ఉంటే ఇక సినిమా వేరే లెవల్లో ఉంటుందని అందరూ భావిస్తున్నారు.
Ram Gopal Varma: సీఎం జగన్‌కు రాంగోపాల్ వర్మ బహిరంగ లేఖ
ఆ సంగతి అలా ఉంచితే గతంలో అల్లు అర్జున్ చేసిన సినిమాల పాటలు డాన్స్ చేసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వచ్చిన డేవిడ్ వార్నర్ బన్నీ అలవైకుంఠపురంలో సినిమా సమయంలో వార్నర్ ఆ మూవీ పాటలకు స్టెప్పులేసి ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇక ఆయన ఇప్పుడు హైదరాబాద్ లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ మ్యాచ్ కు అంతా సిద్దమవుతున్న క్రమంలో పుష్ప మేనరిజంలో తగ్గేది లేదు అని అర్థం వచ్చేలా సైగలు చేయడం హాట్ టాపిక్ అయింది. హైదరాబాద్ వేదికగా ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ప్రాక్టీస్ మ్యాచులో తలపడగా ఈ మ్యాచులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. వార్మప్ మ్యాచ్ లు కూడా సాధారణ మ్యాచ్ ల లానే జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ లోనే ఫీల్డింగ్ చేస్తున్న డేవిడ్ వార్నర్ బాల్ ను బౌండరీకి వెళ్లకుండా అడ్డుకుని ఆ తరువాత తగ్గేదేలే అని అంటూ మేనరిజం చేసి చూపించడం గమనార్హం.
PushpaRaj fever In world Cup warm-up match. HYD📍🤩
This time warner doing the mannerism at @alluarjun's fort🔥.. #AUSvPAK pic.twitter.com/dgXrvBMnz2
— Trends Allu Arjun ™ (@TrendsAlluArjun) October 3, 2023