“పుష్ప”రాజ్ రాకకు సర్వం సిద్ధమైంది. ఓవర్సీస్ సమస్య క్లియర్ అయ్యింది. అలాగే బాలీవుడ్ లో సెన్సార్ సమస్యలు ఉన్నాయి అంటూ సినిమా విడుదలపై సందేహం వ్యక్తం చేసిన వారికి సోషల్ మీడియా ద్వారా 5 భాషల్లోనూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది ప్రకటించి సమాధానం ఇచ్చింది చిత్రబృందం. ఇక ఈ చిత్రం దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 3000లకు పైగా థియేటర్లలో విడుదల కానుంది. ఆంధ్ర, తెలంగాణాలో 1150, కర్ణాటకలో 140కి పైగా థియేటర్లలో, తమిళనాడులో 280 థియేటర్లలో, కేరళలో 200, బాలీవుడ్ లో 600లకు పైగా థియేటర్లలో, ఇంకా ఓవర్సీస్ లో 600లకు పైగా థియేటర్లలో విడుదల కానుంది ‘పుష్ప’.
Read also : విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు “లైగర్”డబుల్ ట్రీట్
ఇక సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండడంతో ‘పుష్ప’రాజ్ టీం, ప్రేక్షకులతో పాటు సినీ ఇండస్ట్రీ అంతా ఆతృతగా ఉన్నారు. సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. మరోవైపు హైదరాబాద్ లో సినిమాకు సంబంధించి బెనిఫిట్ షోలకు సర్వం సిద్ధమైంది. హైదెరాబాద్ లోని థియేటర్లలో రేపు ఉదయం 4 గంటలకు బెనిఫిట్ షోలను ప్రదర్శించనున్నారు. అయితే ఆంధ్రాలో మాత్రం టికెట్ ధరల విషయం, అలాగే బెనిఫిట్ షోలకు సంబంధించి రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ కు ఫస్ట్ పాన్ ఇండియాతో ‘పుష్ప’రాజ్ ఎలాంటి అనుభవాన్ని ఇవ్వనున్నాడో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.