ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘పుష్ప’. డిసెంబర్ 17న విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ ఇప్పటికీ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తోంది. సినీ విమర్శకులతో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించిన ఈ సినిమా మంచి కలెక్షన్లతో హిందీలోనూ ‘పుష్ప’రాజ్ గా అల్లు అర్జున్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. ఇక సినిమా విడుదలైనప్పటి రోజుకో అప్డేట్ ను విడుదల చేస్తూ ఇప్పటికీ అందరి దృష్టిపై ‘పుష్ప’పై పడేలా చేస్తున్నారు మేకర్స్. ఈ మేరకు నిన్న ఈ సినిమాలో ‘దాక్కో దాక్కో మేక’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. తాజాగా సినిమాలోని ఓ హైలెట్ డిలేటెడ్ సీన్ ను విడుదల చేశారు.
Read Also : సమంత న్యూఇయర్ సెలబ్రేషన్ ప్లాన్ ఇదేనట !
ఈ వీడియోలో ‘పుష్ప’కు అప్పు ఇచ్చిన వ్యక్తి వాళ్ళ ఇంటికి వచ్చి నానా గొడవా చేస్తున్నాడు. అంతేకాదు ‘పుష్ప’రాజ్ మిల్లులో పని మానేశాడన్న నిజాన్ని కూడా వాళ్ళ అమ్మకు చెప్పేశాడు. ఏమాత్రం బాధ్యత లేని యువకుడిగా కన్పించిన ‘పుష్ప’రాజ్ వాళ్ళ గేదెను అమ్మేసి ఆ అప్పు తీర్చేశాడు. అయితే అప్పు వసూలు చేయడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నానా రచ్చ చేసి ‘పుష్ప’ కుటుంబం అప్పు తీసుకున్నట్టుగా అందరికీ తెలిసేలా చేశాడుగా… మరి అప్పు తీర్చేసినట్టు తెలిసేదెలా… ఇలా గుట్టుగా అప్పు తీర్చేస్తే ‘పుష్ప’రాజ్ ఎలా అవుతాడు. అందుకే హీరోయిజంను హైలెట్ చేసే విధంగా ఉన్న ఈ సీన్ లో తాను అప్పును తీర్చేసినట్టు ఇంతకు ముందు గొడవ చేసిన వ్యక్తితోనే తన స్టయిల్ లో చెప్పించడం ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక మందన్న ప్రధాన పాత్రలు పోషించారు. సుకుమార్ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించారు. ఫహద్ ఫాసిల్, జగపతి బాబు, ప్రకాష్ రాజ్మ్ ధనంజయ్, సునీల్, అనసూయ భరద్వాజ్, తదితరులు ఈ చిత్రంలో ప్రధాన సహాయ పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి నేపథ్య సంగీతం సమకూర్చారు.