Pushpa 2: పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయిందోచ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2: పుష్ప.. పుష్ప.. పుష్ప.. మూడు రోజులుగా పుష్ప పేరు మోత మ్రోగిపోతుంది. తిరుపతి జైలు నుంచి పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడు..? అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్ లో మెదులుతూనే ఉంది. ఇక దానికి ఆన్సర్ తెలిసిపోయింది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా తరువాతనే స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ గా మార్చింది. బన్నీని ఆర్య నుంచి పుష్ప అని పిలిచుకొనేలా చేసింది. పుష్ప 1 తో హైప్ క్రియేట్ చేసి వదిలేసిన సుక్కు ..పుష్ప 2 కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసేలా చేశాడు.. ఇక ఆ ఎదురుచూపులుకు సమాధానం వచ్చేసింది. రేపు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప 2 నుంచి ఒక స్పెషల్ సర్ ప్రైజ్ ను ఇచ్చి అభిమానుల్లో జోష్ పెంచేశారు. ఈ టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
మూడు నిముషాలు ఉన్న ఈ వీడియో గూస్ బంప్స్ తెప్పిస్తుంది. తిరుపతి పోలీస్ స్టేషన్ నుంచి 8 బుల్లెట్ల గాయాలతో పారిపోయిన పుష్ప ఎక్కడ ఉన్నాడో తెలియక పోలీసులు ఒక పక్క వెతుకుతూ ఉండగా .. ఇంకోపక్క పుష్ప మద్దతుదారులు అతని కోసం పోలీస్ స్టేషన్ మీద దాడికి దిగడం, అల్లర్లు చేయడం చూపించారు. పుష్ప అసలు బతికి ఉన్నాడా..? లేక పోలీసులు చంపి డ్రామాలు ఆడుతున్నారా..? అన్న అనుమానాలు… పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పుష్ప విదేశాలకు పారిపోయాడని చర్చలు.. ఇక వీటన్నింటి మధ్య పుష్ప శేషాచల అడవుల్లో కనిపించినట్లు చూపించిహైప్ పెంచేశాడు సుకుమార్. వావ్ వీడియో మాత్రం అదిరిపోయింది. ఇక ” అడవిలో జంతువులూ రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం.. అదే పులే రెండు అడుగులు వెనక్కి వచ్చిందంటే పుష్ప వచ్చాడని అర్ధం” అనే ఒక్క డైలాగ్ తో పుష్ప ఏంటి అనేది చూపించేశాడు. ఇక చివర్లో పుష్పరాజ్ రూల్ అని చెప్పే షాట్ వీడియోకె హైలైట్ గా నిలిచింది. ఇక దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మరో హైలైట్ అని చెప్పాలి. పుష్పకు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నే కంటిన్యూ చేసి అభిమానులకు మరోసారి తన సత్తా ఏంటో చూపించాడు. విజువల్స్, సెట్టింగ్స్ తో సుకుమార్ ఈ సినిమా అంచనాలను మరింత పెంచేశాడు. పుష్ప మ్యానియా మరోసారి మొదలయ్యింది. సినిమా రిలీజ్ అయ్యేవరకు ఈ మ్యానియా తగ్గేదేలే అని చెప్పాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!