ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మన లెక్కల మాస్టారు సుకుమార్ కలిసి.. ఈసారి డబుల్ ఫోర్స్‌తో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప పార్ట్ వన్ కంటే భారీగా పుష్ప2ని తెరకెక్కిస్తున్నారు. లేట్ అయిన పర్లేదు కానీ.. కొడితే కుంభ స్థలాన్నే కొట్టాలి అనేలా పుష్పరాజ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు సుకుమార్. అందుకు శాంపిల్‌గా గతంలో వచ్చిన పుష్ప2 మూడు నిమిషాల వీడియో అని చెప్పొచ్చు. పుష్ప2 వీడియో చూసిన తర్వాత సినిమా పై అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇక మధ్య మధ్యలో లీక్ అవుతున్న ఆన్ లొకేషన్ పిక్స్, వీడియోలు బన్నీ ఫ్యాన్స్‌ను తెగ టెంప్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా రీసెంట్‌గా వచ్చిన లీక్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. నదిలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీ చేజింగ్ సీన్స్ నెక్స్ట్ లెవల్ అనేలా ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చిత్తూరులోని స్వర్ణముఖి నది పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది.
పుష్పరాజ్ అండ్ విలన్ల మధ్య ఛేజింగ్ సీన్స్ షూట్ చేస్తున్నారట. స్వర్ణముఖి నదిలో జరిగే ఈ యాక్షన్స్ సీక్వెన్స్ సినిమాలోనే మెయిన్ హైలైట్‌గా నిలిచేలా ఉంటుందట. ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఈ సీన్స్.. పుష్పరాజ్ క్యారెక్టర్‌ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని తెలుస్తోంది. రీసెంట్‌గా లీక్ అయిన ఛేజింగ్ సీన్ కూడా అదిరిపోయాయి. అందుకే పుష్ప2 ఇంటర్వెల్ బ్యాంగ్ మామూలుగా ఉండదని అంటున్నారు. ఇకపోతే.. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను.. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ ఎత్తున నిర్మిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ సీజన్లో పుష్ప2 రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది.