Purushothamudu Movie Gearing up For Release: లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న మూవీ ‘పురుషోత్తముడు’. చాలా కాలం క్రితమే అనౌన్స్ చేసిన ఈ సినిమాను రామ్ భీమన దర్శకత్వంలో శ్రీ శ్రీదేవి ప్రొడక్షన్స్ బేనర్ లో నిర్మాతలు డా.రమేశ్ తేజావత్, ప్రకాష్ తేజావత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ ‘పురుషోత్తముడు’ సినిమ రాజమండ్రిలో వేసిన భారీ సెట్ లో ఇటీవలే టాకీ పూర్తి చేసుకున్న సందర్భంగా అయోధ్య ఈవెంట్ జరిగిన రోజే అంటే 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు మేకర్స్. అయోధ్య రామజన్మభూమి ప్రాణప్రతిష్ట రోజు అదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు.
Shiva Karthikeyan: రోబో, 2.O సినిమాల్లో కంటే ‘అయలాన్’లోనే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్!
ఇక నిర్మాతలు మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో భారీ తారాగణం ఉంటుందని అన్నారు. ఇక సంగీత దర్శకుడు గోపి సుందర్ స్వరపరచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, సినిమా అవుట్ ఫుట్ కూడా బాగా రావడంతో గొప్ప విజయం సాధించబోతుందని నమ్ముతున్నామని వెల్లడించారు. కెమెరామెన్ పి.జి.విందా మాట్లాడుతూ తన కెరీర్ లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసి ఈ సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినిమా యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరసన హాసిని సుధీర్ అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. ఇక మురళి శర్మ, కౌసల్య, ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణన్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, ముఖేష్ ఖన్నా, రాజా రవీంద్ర,రాజ్ తిరన్ దాస్, రచ్చ రవి, కంచరపాలెం రాజు ఇతర కీలక పాత్రలలో నటించారు.