Shiva Karthikeyan: రోబో, 2.O సినిమాల్లో కంటే ‘అయలాన్’లోనే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shiva Karthikeyan Latest Interview for Ayalaan: శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఫాంటసీ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ ‘అయలాన్’ను తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 26న గంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ ద్వారా మహేశ్వర్ రెడ్డి విడుదల చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ఆర్. రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కెజెఆర్ స్టూడియోస్ పతాకంపై కోటపాడి జె. రాజేష్ నిర్మించగా తాజాగా తెలుగు మీడియాతో శివకార్తికేయన్ ముచ్చటించారు.
*ఏలియన్ ఇద్దరు హీరోల సినిమా అని తమిళనాడులో చెప్పారు. ఎందుకు?*
‘అయలాన్’ సినిమాలో ఇద్దరు హీరోలు ఉన్నారు. నేను ఓ హీరో అయితే… మరొక హీరో ఏలియన్.
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
*హీరోగా మీ కెరీర్ చూస్తే ఎక్కువ రోజులు పట్టిన సినిమా ఇదే. అంత బలంగా చేయాలని ఫిక్స్ అయిన కారణం ఏమిటి?*
దర్శకుడు రవికుమార్ విజన్. ‘అయలాన్’ సినిమాలో 4500 వి.ఎఫ్.ఎక్స్ షాట్స్ ఉన్నాయి. రోబో, 2.ఓ సినిమాల్లో కంటే ఎక్కువ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమా ఇది. అయితే మా బడ్జెట్ తక్కువ. పరిమిత నిర్మాణ వ్యయంలో కనుక సినిమా తీయగలిగితే మరింత పెద్ద కలలు కనొచ్చు అనిపించింది. అందుకే ఎక్కువ రోజులు పట్టినా తప్పకుండా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను.
*మేకింగ్ కోసం ఎక్కువ రోజులు పడితే… ఐడియా లీక్ కావచ్చు. వేరే హీరో, దర్శక – నిర్మాతలు ఈ తరహా కథతో సినిమా తీయవచ్చు. ఈ డౌట్స్ మీకు వచ్చాయా?*
చిన్న చిన్న సందేహాలు అయితే ఉన్నాయి. నేను హాలీవుడ్ సినిమా పేరు చెప్పను కానీ మేము తీసిన సన్నివేశం ఆ తర్వాత విడుదలైన ఓ సినిమాలో ఉంది. ఫాంటసీ సూపర్ హీరో ఫిలిం కాబట్టి కొన్ని కొన్ని సన్నివేశాలు మనం ముందు తీసినప్పటికీ తర్వాత విడుదలైన కొన్ని సినిమాల్లో ఉండవచ్చు. అయితే… ఏలియన్ – మనిషి మధ్య సన్నివేశాలు, వాళ్ళిద్దరి ఇంటరాక్షన్, అయలాన్ కోర్ పాయింట్ మీద ఇప్పటివరకు సినిమా రాలేదు. మా స్క్రిప్ట్ ఐడియా ఇప్పటికీ కొత్తగా ఉంది. ఒకవేళ మా దర్శకుడు కనక ఇప్పుడు స్క్రిప్ట్ రాస్తే స్క్రీన్ ప్లే మార్పులు ఏదైనా చేస్తాడేమో. తమిళ నాడులో సినిమా చూసిన వాళ్ళు ఎవరు కథపై కంప్లైంట్ చేయలేదు. చాలా కొత్తగా ఉందని చెప్పారు. అది మా అదృష్టం.
*ఐదేళ్ల మేకింగ్ టైంలో మిమ్మల్ని మోటివేట్ చేసిన అంశం ఏమిటి?*
200, 300 కోట్ల బడ్జెట్ ఉంటే తప్ప ఇటువంటి సినిమా చేయలేమని చెబుతారు. సరైన టీమ్, ఐడియా ఉంటే తక్కువ బడ్జెట్ లో కూడా చేయవచ్చు. ఇది హిట్ అయితే ఎక్కువ బడ్జెట్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు వస్తారు. అప్పుడు మేం ఇంకా పెద్ద కలలు కనొచ్చు. మమ్మల్ని మోటివేట్ చేసిన అంశం అదే.
*సినిమాలో గ్రాఫిక్స్ పార్ట్ నిడివి ఎంత?
‘అయలాన్’లో 90 శాతం సన్నివేశాల్లో గ్రాఫిక్స్ ఉన్నాయి. 70 శాతం సినిమాలో ఏలియన్ ఉంది. సో… మెజారిటీ సినిమా అంతా విజువల్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి.
*ముందు నుంచి రెహమాన్ ని సంగీత దర్శకుడిగా అనుకున్నారా?*
అవును… రెహమాన్ మ్యూజిక్ ఫిక్స్. ఆయనతో నా ఫస్ట్ సినిమా ఇది. నేను రెహమాన్ కి పెద్ద ఫ్యాన్. ఆయన నా సినిమాకు సంగీతం అందించాలనేది బిగ్గెస్ట్ డ్రీం. ఈ సినిమాతో రవికుమార్ ఐడియా కారణంగా అది కుదిరింది. ఆయన మాకు ఎంతో మోటివేషన్ ఇచ్చారు. లాస్ట్ సెకండ్ వరకు వర్క్ చేశారు. నేను ఇక్కడ ఇంకా బాగా చేయాల్సింది అని రెహమాన్ చెప్పారు. తెలుగులో విడుదలకు రెండు వారాలు టైమ్ ఉండటంతో మ్యూజిక్ పరంగా కొన్ని ఇంప్రవైజేషన్స్ కూడా చేశారు.
*రెహమాన్ తో డ్యాన్స్ చేయించినట్టు ఉన్నారు!*
డ్యాన్స్ మాస్టర్ శాండీ వల్ల కుదిరింది. ‘మామన్నన్’ (తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైన ఉదయనిధి స్టాలిన్, కీర్తీ సురేష్ సినిమా) ప్రమోషనల్ సాంగ్ కోసం చిన్న స్టెప్ వేశారు. మేం ఆయనతో రెండు గంటలు డ్యాన్స్ చేయించాం, అయితే ఆయన చాలా ఫాస్ట్. బహుశా… ముందు డ్యాన్సర్ ఏమో! రెండు గంటల్లో చేశారు.
*’అయలాన్’ గురించి ప్రేక్షకులకు ఏం చెబుతారు?*
‘అయలాన్’ సినిమాలా ఉండదు… మీరు థీమ్ పార్క్ లోకి వెళ్లినట్టు ఉంటుంది. జాలీ రైడ్ కింద ఉంటుంది. రెండున్నర గంటలు హాయిగా చూసి తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు. సీక్వెల్ ఐడియా ఉంది. ఏలియన్ క్రియేట్ చేయడానికి మేం చాలా రీసెర్చ్ చేశాం. ఎక్కువ టైమ్ స్పెండ్ చేశాం. సీక్వెల్ ఐడియా మాకు ముందు నుంచి ఉంది. సీక్వెల్ ఇంకా బిగ్గర్ స్కేల్ లో చేస్తాం. తమిళనాడులో సక్సెస్ మమ్మల్ని మోటివేట్ చేసింది.
*కమల్ హాసన్ నిర్మాణంలో ఒక సినిమా చేస్తున్నారు కదా! దాని గురించి…*
ఆల్రెడీ 80 శాతం షూటింగ్ కంప్లీట్ చేశాను. జానర్, సినిమా స్టైల్ గురించి ఇప్పుడు నేను చెప్పలేను. అందులో నేను, సాయి పల్లవి నటిస్తున్నాం. వేసవిలో విడుదల కావచ్చు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!