Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమ్మర్ కానుకగా మే 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పురుష:’. కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంతో ఆయన తనయుడు పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత కోటేశ్వరరావు తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర, సంచలన విషయాలు పంచుకున్నారు. తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వీరాభిమానిని అని ఆయన తెలిపారు. “‘గోకులంలో సీత’ సినిమా చూసినప్పటి నుంచే నేను ఆయన ఫ్యాన్‌గా మారిపోయాను. ఆ వయసులో నన్ను నేను ఆయనలో చూసుకున్నాను. నాకు కొడుకు పుడితే కచ్చితంగా ఆయన పేరే పెట్టుకోవాలని డిసైడ్ అయ్యా. అనుకున్నట్టుగానే ‘తమ్ముడు’ సినిమా టైమ్‌లో మాకు బాబు పుట్టడంతో పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టాను” అని ఆయన వెల్లడించారు.
గుంటూరు జిల్లా కారంపూడికి చెందిన తనకు సినీ నేపథ్యం ఏమాత్రం లేదని, కేవలం తన అబ్బాయికి ఉన్న సిగ్గు, బిడియం పోగొట్టడానికే ఇండస్ట్రీకి వచ్చానని కోటేశ్వరరావు కుండబద్దలు కొట్టారు. “డబ్బుల కోసమో, లాభాలు ఆశించో నేను ఈ సినిమా తీయలేదు. హీరో అవ్వాలన్న నా కలను నా కొడుకు ద్వారా నెరవేర్చుకుంటున్నాను. అయితే, మా అబ్బాయికి ముందే ఒక కండిషన్ పెట్టాను. నా స్థోమత కొద్దీ అతనికి ఒక మూడు సినిమాలు తీస్తాను.. అప్పటిలోగా హీరోగా నిలబడితే ఓకే, లేదంటే మళ్లీ ఊరొచ్చి వ్యవసాయం చేసుకోవాలని ముందే తేల్చి చెప్పేశాను” అని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
- Priyanka Chopra: ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పడానికి వాళ్లే కారణమట! వీడియో వైరల్..
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!