Site icon NTV Telugu

Puri – Sethupathi : పూరీ-సేతుపతి మూవీ పూజా కార్యక్రమం షురూ..

Puri

Puri

Puri – Sethupathi : డైరెక్టర్ పూరీ జగన్నాథ్-విజయ్ సేతుపతి కాంబోలో భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చార్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్ సేతుపతి రాలేదు. పూరీ జగన్నాథ్, చార్మీలు హాజరయ్యారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ జులై నుంచే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో కన్నడ స్టార్ దునియా విజయ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మిగతా నటీనటులను తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.

read also : Nithin : క్షమించండి.. ఇక నుంచి మంచి సినిమాలు చేస్తా

పూరీ కనెక్ట్స్, చార్మీ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలోకి మరో నిర్మాత వచ్చి చేరారు. జేబీ మోషన్ పిచర్స్ అధినేత జెబి నారాయణ నిర్మాతగా పూరి సేతుపతి సినిమా కోసం పూరి కనెక్ట్స్ తో చేతులు కలిపారు. మూవీలో చాలా మంది స్టార్లు నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక్క లాంగ్వేజ్ తోనే సరిపెట్టుకుండా దాదాపు అన్ని లాంగ్వేజెస్ నుంచి నటులను తీసుకుంటున్నారంట. పూరీ వరుస ప్లాపులతో ఉన్నాడు. ఈ మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలనే తపనతో సినిమాను చేస్తున్నారు. ఆయన కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాతో పూరీ రీ ఎంట్రీ ఇస్తారా లేదా చూడాలి.

read also : Kubera : ’మాది మాది సోకమంతా’ వీడియో సాంగ్ రిలీజ్

Exit mobile version