సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో మొదటిసారిగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా బాక్సింగ్ మూవీ “లైగర్”. బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోంది. మేకర్స్ విజయవంతంగా ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసారు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ కూడా ఇచ్చారు. అంతేకాదు దర్శకుడు పూరీ తన నెక్స్ట్ మూవీ “జనగణమన” కీలక అప్డేట్ కూడా ఇచ్చాడు.
Read Also : ప్రభాస్ “ప్రాజెక్ట్ కే” మేజర్ అప్‌డేట్
చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మి కౌర్ ట్విట్టర్‌లో అప్‌డేట్‌ను పంచుకున్నారు. ఆమె ట్విటర్‌లో పూరీ జగన్ వాయిస్ నోట్‌ను షేర్ చేసింది, ఇందులో పూరీ “మేము లైగర్ షూట్‌ను ముగించాము. ఈ రోజు నుండి జనగణమన” అంటూ తన డ్రీం ప్రాజెక్ట్ పై కీలక అప్డేట్ ఇచ్చారు. గతంలోనే మహేష్ బాబు, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో ‘జనగణమన’ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చినా సినిమా మాత్రం టేకాఫ్ కాలేదు. ఇప్పుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి ఈ సినిమాను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.
#LIGER #JGM@TheDeverakonda #purijagannadh pic.twitter.com/iI80NUAg5c
— Charmme Kaur (@Charmmeofficial) February 6, 2022