సోనూసూద్ నటుడిగా, మానవతావాదిగా దేశ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే అరక్షణం కూడా ఆలోచించకుండా సాయం అందించే గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇప్పుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయనను అరెస్ట్ చేయాలంటూ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇంతకీ సోనూసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ కావడానికి గల కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోనూసూద్ కు మోసం కేసులో వాంగ్మూలం ఇవ్వడానికి రాకపోవడంతో పంజాబ్ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
సోనూసూద్ ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సోనూసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ కావడానికి గల కారణం ఏంటంటే? లుథియానాకు చెందిన అడ్వకెట్ రాజేశ్ ఖన్నా తనకు మోహిత్ శర్మ అనే వ్యక్తి రూ. 10లక్షలు మోసం చేశాడని కోర్టులో కేసు పెట్టారు. రిజికా కాయిన్ పేరుతో తనతో పెట్టుబడి పెట్టించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో సదరు న్యాయవాది సోనూసూద్ ను సాక్షిగా పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కోర్టు సోనూసూద్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇదివరకే సమన్లు పంపించినప్పటికీ సోనూసూద్ హాజరుకాకపోవడంతో అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టాలని అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.