Site icon NTV Telugu

James: తెరపై పునీత్ ని చూస్తూనే ఆగిన అభిమాని గుండె

james

james

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతిచెందిన విషయాన్ని ఇప్పటికీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అంటే ఆయనపై ఎంతటి అభిమానాన్ని పెంచుకున్నారో అర్ధమవుతుంది. ఇక ఇటీవలే పునీత్ చివరి చిత్రం జేమ్స్ విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. పునీత్ అభిమానులే కాకుండా అందరూ ఆ సినిమాను ఆదరించి పునీత్ కి కన్నీటి నివాళులు అర్పిస్తున్నారు. ఇక తాజాగా ఒక అభిమాని తన అభిమాన హీరోను చూస్తూనే కన్నుమూయడం సంచలనంగా మారింది.  ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా గ్రామంలో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. నంజనగూడు గ్రామానికి చెందిన ఆకాష్(22) కి పునీత్ అంటే ఎనలేని అభిమానం. ఆయన నటించిన ప్రతిసినిమాను చూస్తూ పెరిగాడు. ఇక ఇటీవలే ఆయన మృతిని జీరించుకోలేకపోయాడు.. అయినా అభిమానాన్ని చంపుకోలేకపోయాడు. తన ఫెవరెట్ హీరో చివరి చిత్రాన్ని చూడాలని స్నేహితులతో కలిసి థియేటర్ కి వెళ్ళాడు. వెండితెరపై పునీత్ ని చూడగానే ఎమోటినల్ అయ్యాడు. ఆయన లేడు అన్న విషయం తలుచుకొని బాధపడ్డాడు. అలా తన అభిమాన హీరోను చూస్తూనే ఆకాష్ కుప్పకూలిపోయాడు. చుట్టూ ఉన్నవారు ఏమైంది అని చూసేలోపులోనే అతడు మృతిచెందినట్లు అతడి స్నేహితులు తెలిపారు. ఆకాష్ కి గుండెపోటు రావడంతోనే మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. అభిమాన హీరో మృతిని జీర్ణించుకోలేక అభిమాని గుండె ఆగడం ఎంతో విచారకరం అని, అలాంటి అభిమానాన్ని సంపాదించుకున్న పునీత్ నిజంగా గొప్పవాడని కన్నడ అభిమానులు కంటతడి పెడుతున్నారు.

Exit mobile version