Avatar 2: అవతార్ నచ్చలేదని చెప్తే ఊరుకోరు.. పవన్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Avatar 2: సినీ అభిమానులంతా ఎంతగానో ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. ఎట్టకేలకు అవతార్ 2 థియేటర్ లో సందడి చేసింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాను దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించాడు. అవతార్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమా కూడా మొదటి నుంచి పాజిటివ్ టాక్ తోనే ముందుకు వెళ్తోంది. అభిమానులతో పాటు ప్రముఖులు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి అవతార్ విజువల్ వండర్ అని, సూపర్ అని, అద్భుతమని చెప్పుకొస్తున్నారు. అయితే ఇందుకు విరుద్ధంగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ట్వీట్ చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సూర్యదేవర నాగవంశీ.. టాలీవుడ్ కుర్ర నిర్మాత.. భీమ్లా నాయక్, డీజే టిల్లు లాంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న నాగ వంశీ ప్రస్తుతం మహేష్- త్రివిక్రమ్ కాంబో తెరకెక్కిస్తున్న చిత్రంని నిర్మిస్తున్నాడు. ఇక తాజాగా ఈయన అవతార్ 2 రివ్యూ చెప్పుకొచ్చాడు. “జేమ్స్ కామెరూన్ లాంటి వాడు తీసాడు కనుక.. సినిమా ఎలా ఉన్నా ఒక మెరిన్ బయోలజీ డాక్యూమెంటరీ తీసినా అది ఒక అద్భుతమని, విజువల్ వండర్ అని పొగిడి తీరాలి.. ఇంకేమి చెప్పినా నావీ ఊరుకోదు” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. అవతార్ 2 సినిమా తనకు నచ్చలేదని కొంచెం పోష్ గా చెప్పుకొచ్చాడు. ఇక దీంతో అవతార్ ఫ్యాన్స్ అసెంబెల్ అయ్యారు. మీరు తీసే చెత్త సినిమాల కంటే ఈ సినిమా బావుందని కొందరు.. హీరో హీరోయిన్ల ముద్దులు.. హీరో ఎలివేషన్స్ కాకుండా ఇలాంటి విజువల్స్ తో సినిమా తీసి అప్పుడు చెప్పండి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
James Cameron orders us to watch a Marine biology documentary. And because it is 3D and him, it is a "Visual Spectacle"! All we are allowed to say is "Mastercraft" and "Blockbuster", anything else, Na'vi won't accept 😜😉🤪
— Naga Vamsi (@vamsi84) December 16, 2022
తాజావార్తలు
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి అకస్మాత్తుగా ఎందుకు రిటైర్ అయ్యాడు..? అసలు కథ ఇదే..
-
Tilak Varma Run Out: తిలక్ వర్మ నిర్లక్ష్యం.. ఊహించని రీతిలో రనౌట్.. అసలేం జరిగిందంటే?
-
Ranji Trophy: బ్యాట్తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
ట్రెండింగ్
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్దీప్కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..