MS Raju-Trisha“త్రిషకు నేనంటే ప్రాణం”.. ఎంఎస్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి ఇండస్ట్రీ హిట్లను అందించిన, సంక్రాంతి రాజుగా ఎంఎస్ రాజు అందరికి సుపరిచితులు. త్రిషను టాలీవుడ్లో టాప్ లీగ్‌లోకి తీసుకెళ్లిన ఘనత ఎంఎస్ రాజుదే. ‘వర్షం’ సినిమాతో ఆమెకు లైఫ్ ఇచ్చిన రాజు.. తాజాగా ఒక ఆంగ్ల పత్రిక ఇంటర్వ్యూలో త్రిష తన గురించి చెప్పిన ఒక క్రేజీ సీక్రెట్‌ను, అలాగే తనపై ఆమెకున్న ప్రాణప్రదమైన అభిమానాన్ని ఎమోషనల్‌గా వివరించారు.
ఎంఎస్ రాజు మాట్లాడుతూ.. ‘ఆమెకు నేనంటే ప్రాణం, నన్ను దేవుడిలా చూసుకుంటుంది. ఒకసారి ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రిక వాళ్లు త్రిషను ఇంటర్వ్యూ చేస్తూ.. ‘రాత్రి 3 గంటల సమయంలో మీకు ఏదైనా సమస్య వస్తే, ఎవరికి ఫోన్ చేసి మాట్లాడటానికి కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు?’ అని ప్రశ్నించారు. దానికి ఆమె వెనుకాడకుండా ‘ఓన్లీ ఎంఎస్ రాజు గారు’ అని సమాధానం ఇచ్చింది. నాపై ఆమెకు అంతటి నమ్మకం, అభిమానం ఉన్నాయి’ అని తెలిపారు. త్రిషకు ‘వర్షం’ సినిమాలో అవకాశం రావడం వెనుక ఉన్న ఆసక్తికర కథను రాజు గారు బయటపెట్టారు. గుణశేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు చేసిన ‘అర్జున్’ సినిమా కోసం మొదట త్రిషను అనుకున్నారట. కానీ ఆ క్యారెక్టర్‌కు సెట్ కాదని రిజెక్ట్ చేశారు..
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
అయితే ‘ఆ ఫోటోలు మహేష్ బాబు దగ్గర చూసి.. ‘ఈ అమ్మాయి బాగుంది కదా బాబు, నేను నా సినిమాలో పెట్టుకోవచ్చా?’ అని అడిగాను. ఆయన పెట్టుకోమన్నారు. నేను ఫోన్ చేయగానే త్రిష, వాళ్ల అమ్మగారు ఎంతో ఎక్సైట్ అయ్యారు. చెన్నై వెళ్లి ఆమెను ఫైనల్ చేశాను. ‘వర్షం’ సినిమా కోసం ఆ అమ్మాయి ఏకంగా 75 రోజులు వానలో తడిసింది. కొన్ని కష్టమైన యాక్షన్ సీక్వెన్స్, రైలులోంచి దూకే సీన్లు చేయలేక ఏడ్చేసేది. ‘చేయలేకపోతే వెళ్ళిపో’ అని నేను గద్దించేవాడిని.. అయినా పట్టుదలగా చేసి చూపించింది. అప్పటినుంచి ఆమె మా ఫ్యామిలీ మెంబర్ అయిపోయింది’ అని రాజు గారు గుర్తు చేసుకున్నారు.
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమాకు మొదట త్రిషను రిపీట్ చేయకూడదు అనుకున్నారట. కానీ త్రిష ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఎంఎస్ రాజు గారి ఇంటికి వచ్చి భోజనం చేసి, తన డేట్స్ డైరీ ఓపెన్ చేసి.. “మీకు ఎప్పుడు డేట్స్ కావాలో రాసుకోండి” అని అడిగిందట. అలా ఏ హీరో, హీరోయిన్ అడగరని ఆయన కొనియాడారు. ప్రస్తుతం సూర్య ‘వీరభద్రుడు’ (కరుప్పు) సక్సెస్‌తో జోష్‌లో ఉన్న త్రిష గురించి ఎంఎస్ రాజు చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!