Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Producer Bunny Vas Media Partner Clarity On Sunitha Boya Issue

Sunitha Boya: తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు: నిర్మాత బన్నీ వాస్ ప్రతినిధి

Published Date :March 28, 2022 , 10:20 pm
By ramakrishna
Sunitha Boya: తప్పుడు ఆరోపణలు నమ్మొద్దు: నిర్మాత బన్నీ వాస్ ప్రతినిధి
  • Follow Us :
  • google news
  • dailyhunt

నిర్మాత బన్నీ వాస్‌పై సునీత బోయ అనే మహిళ కొంతకాలంగా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై బన్నీ వాస్ అధికారిక ప్రతినిధి మీడియాకు వివరణ ఇచ్చారు. గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే 2019 నుంచి సునీత బోయ, గీతా ఆర్ట్స్ సంస్థ, అలాగే నిర్మాత బన్నీ వాస్ పై నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని, ఆమె సమాజంలో ప్రముఖులను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి ఆరోపణలు ఎంతో కాలంగా చేస్తోందని తెలిపారు. దీనికి ఆధారాలు కావాలంటే 2019 నుంచి ఇప్పటి వరకు ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు, యూట్యూబ్ లింక్‌లను చూడవచ్చన్నారు.

అయితే సునీత ఆరోపణలపై బన్నీ వాస్ తొలుత స్పందించలేదని.. సినిమా ఇండస్ట్రీలోనూ అవకాశాల కోసం ప్రయత్నించి విఫలమై ఉంటుందేమో అనే జాలితో వదిలేశారని, కానీ దానిని అలుసుగా తీసుకుని సునీత గీతా ఆర్ట్స్ సంస్థతో పాటు బన్నీ వాసు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను కూడా రాతల్లో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిందన్నారు. అంతటితో ఆగకుండా బన్నీ వాస్ నాలుగు సంవత్సరాల కుమార్తెను చంపాలనే ఆలోచనలు తనకు వస్తున్నాయని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో సునీత ఒక వీడియోను పోస్ట్ చేసిందని, దాంతో మరో దారి లేక బన్నీ వాస్ న్యాయబద్ధంగా పోరాడాలని పోలీసులతో పాటు గౌరవ న్యాయస్థానం వైపు అడుగులు వేశారని వాస్ ప్రతినిధి తెలిపారు.

తాజాగా పోలీసులను ఆశ్రయించిన తర్వాత బన్నీ వాస్‌పై మరింత పగ పెంచుకున్న సునీత బోయ తన వేధింపులను తారాస్థాయికి తీసుకెళ్లిందని, తనను లైంగిక వేధింపులకు గురి చేసాడని కొత్త కట్టుకథతో ముందుకొచ్చిందని, ఇదంతా పూర్తిగా అబద్ధమని బన్నీ వాస్ తెలియజేశారన్నారు. గీతా ఆర్ట్స్ సంస్థ, బన్నీ వాస్ కదలికలను ఎప్పటికప్పుడు నిఘా పెట్టిన సునీత బోయ చాలాసార్లు ఆయనపై దాడులకు కూడా ప్రయత్నం చేసిందని, అందుకే ఆయన ఫిర్యాదు మేరకు ఆమె 3 నెలల పాటు విజయవాడ సబ్ జైలులో శిక్ష అనుభవించింద’ని వారు చెప్పారు. ఆ కోపంతో మరింత తీవ్రస్థాయిలో సునీత వేదింపులు మొదలు పెట్టిందని తెలిపారు. అందువల్ల ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వ్యక్తులను ప్రోత్సహించొద్దని బన్నీ వాస్ తరఫున ప్రతినిధి మీడియాకు మనవి చేశారు. కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మీడియా ముందుకు వచ్చి జరిగిన వాస్తవాలన్నింటిని బన్నీ వాస్ వివరిస్తారని ప్రతినిధి స్పష్టం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Police Case
  • producer bunny vas
  • sunitha boya
  • telugu cinima
  • Tollywood News

తాజావార్తలు

  • Babar Azam: విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్ ఆజామ్.. టీ20 క్రికెట్ చరిత్రలో సువర్ణ అధ్యాయం

  • Kerala Elections 2026: కేరళలో భారీగా పోలింగ్ నమోదు.. ఇది దేనికి సంకేతం..!

  • Chain Snatching: చైన్ స్నాచింగ్ లకు పాల్పడుతున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి.. అరెస్ట్ చేసిన రైల్వే పోలీసులు

  • Melania Trump: “నా పరువు తీస్తున్నారు”.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై ట్రంప్ భార్య సంచలన ప్రకటన..

  • MonaLisa: మహాకుంభమేళ ‘వైరల్ గర్ల్’ మోనాలిసా ప్రేమ పెళ్లిలో కీలక మలుపు.. భర్త ఫర్మాన్ ఖాన్‌పై పోక్సో కేసు

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions