‘టాక్సీవాలా’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన అచ్చ తెలుగమ్మాయి ప్రియాంక జువాల్కర్. ఈ సినిమా హిట్ తరువాత అమ్మడికి అవకాశాలు వెల్లువెత్తాయి.. అయినా అమ్మడు ఏవి పడితే అవి ఎంచుకోకుండా చాలా సెలెక్టీవ్ గా ఎంచుకొని విజయాలను అందుకొంటుంది. ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు చిత్రాలు అలాంటివే .. ఇక తాజాగా మరో వైవిధ్యమైన కథతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతోంది. లేడీ డైరెక్టర్ సంజనారావు దర్శకత్వంలో క్రియా ఫిల్మ్ కార్పొరేషన్ – కల్కి ప్రొడక్షన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ‘గమనం’ చిత్రంలో ప్రియాంక ఒక ముఖ్య పాత్రలో నటిస్తోంది. శ్రీయ శరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో శివ కందుకూరి, ప్రియాంక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్నాయి.
గమనం’ ఈ నెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రియాంక కొన్ని ఆసక్తికరమైన ముచ్చట్లు చెప్పుకొచ్చింది. గమనం సినిమా చూసినంతసేపు వేదం సినిమా గుర్తొస్తుందని, వైవిధ్యమైన కథలు, వైవిధ్యమైన పాత్రల మధ్య సినిమా సాగుతోందని చెప్పింది. ఇక అందాల ఆరబోత గురించి మాట్లాడుతూ ” ఇలాంటి పాత్రలే చేస్తాను అని లేదు.. అన్ని పాత్రలను ట్రై చేయాలనుకొంటున్నాను. కథ డిమాం చేస్తే బోల్డ్ పాత్రలకు కూడా సిద్దమే” అని చెప్పుకొచ్చింది. ఇక దీంతో అమ్మడు అందాల ఆరబోతకు కూడా సిద్ధమని హింట్ ఇచ్చినట్లే.. మొదట్లో కొంచెం బొద్దుగా ఉన్నా ఈ భామ ఇటీవల బక్కచిక్కి నాజూకుగా తయారయ్యి ఎంతోమంది కుర్రకారుకు క్రష్ గా మారిపోయింది. మరి అమ్మడి హింట్ ని అర్ధం చేసుకున్న దర్శకులు అమ్మడి అందచందాలను ఆరబోసే పాత్రలు ఇస్తారా..? లేదా ..? అనేది చూడాలి.