బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా… ఇప్పుడు ఎల్లలు దాటేసి హాలీవుడ్ లోనూ తన సత్తా చాటుతోంది. అంతేకాదు భర్త నిక్ జోనాస్ తో కలిసి అంతర్జాతీయ వేదికలపై హంగామా సృష్టిస్తోంది. అవకాశం చిక్కాలే కానీ పిగ్గీ చాప్స్ తన అందాల ఆరబోతతో అభిమానులను మెస్మరైజ్ చేస్తుంటుంది. సరిగ్గా అలాంటి ఛాన్స్ తాజాగా అమ్మడికి లండన్ లోని బాప్టా అవార్డ్స్ వేడుకలో దక్కింది. రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగిన ఈ వేడుకకు ప్రియాంక, తన భర్త నిక్ తో కలిసి వచ్చింది. ఓపెన్ ఫ్రంట్ లుక్ డ్రస్ వేసుకుని పీసీ రెడ్ కార్పెట్ మీదకు రాగానే అందరి దృష్టి ఆ జంట మీదనే పడింది. ప్రియాంక, నిక్ చేతిలో చేయి వేసి ఆ వేదిక మీద హొయలు పోయిన తీరు చూసి అక్కడ ఉన్న వారు ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమానికి ముందు కూడా బ్లాక్ సెపరేట్స్ లంగా జాకెట్ తో ప్రియాంక మెరిసిపోయింది. బట్టర్ ఫ్లై డిజైనర్ లుక్ తో అదరగొట్టింది. గతంలోనూ ఆస్కార్, కేన్స్ అవార్డుల వేదికపై ప్రియాంక, నిక్ ఇలానే కలిసి సందడిచేసిన విషయాలను ఆహుతులు తలుచుకుని మురిసిపోయారు. సో… ప్రియాంక జోడీ ఎప్పుడు ఏ అంతర్జాతీయ అవార్డులకు వచ్చినా… అభిమానులకు, ఆహుతులకు కన్నుల పండుగే అనే విషయం మరోసారి రుజువైంది.