Anushka : ప్రియదర్శి మంచి జోష్ మీదున్నాడు. మొన్ననే వచ్చిన కోర్టు మూవీ సూపర్ హిట్ టాక్ తో ఇంకా థియేటర్లలో ఆడుతూనే ఉంది. ఆ మూవీ అలా ఉండగానే ఇంకో మూవీని థియేటర్లలోకి తెస్తున్నాడు ప్రియదర్శి. గతంతో పోలిస్తే ఇప్పుడు ప్రియదర్శి మీద అందరికీ నమ్మకం పెరిగింది. రొటీన్ రొట్టకొట్టుడు సినిమాలు చేయకుండా ప్రేక్షకుల మనసెరిగిన కథలు ఎంచుకుంటున్నాడు. బలగం, కోర్టు సినిమాలే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు సారంగపాణి జాతకం అనే సినిమాతో రాబోతున్నాడు. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో వస్తుండటంతో అంచనాలు బాగా పెరిగాయి.
Read Also : Karan Johar : బాలీవుడ్ లో అసలైన స్టార్లు వాళ్లే.. కరణ్ జోహార్ షాకింగ్ కామెంట్స్..
ఈ రోజే మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఏప్రిల్ 18న వస్తున్నట్టు తెలిపారు. అయితే ఈ రిలీజ్ డేట్ ను ముందుగా ఫిక్స్ చేసుకున్నది మాత్రం ఘాటీ సినిమా. అనుష్క మెయిన్ లీడ్ లో క్రిష్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని ముందుగా ఏప్రిల్ 18కు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ మూవీ పోస్టు ప్రొడక్షన్ పనులు ఇంకా చాలానే ఉన్నాయి. పైగా క్రిష్ కు అటు హరిహర వీరమల్లు సినిమా పనులు కొన్ని ఇచ్చారని టాక్. అందుకే ఈ మూవీ వెనకబడింది. చేసేది లేక వాయిదా వేయాలని ఫిక్స్ అయ్యారంట. రేపో, మాపో అధికారికంగా అనౌన్స్ చేయబోతున్నారు. ఘాటీ తప్పుకోవడంతో ప్రియదర్శి ఛాన్స్ వదులుకోకుండా లైన్ లోకి వచ్చాడు. కోర్టు మూవీ హిట్ తో ట్రెండింగ్ లో ఉన్నాడు కాబట్టి సారంగపాణికి ఆటోమేటిక్ గా ప్రమోషన్ అవుతోంది. పెద్దగా కష్టపడకుండానే ఆ మూవీ జనాల్లోకి వెళ్లిపోతోంది. అనుష్క వదిలేస్తే ప్రియదర్శికి ఇలా కలిసొచ్చిందన్నమాట.