Site icon NTV Telugu

Darling Censor: ప్రియదర్శి డార్లింగ్ సెన్సార్ రివ్యూ

Darling

Darling

Darling Censor Review: టాలీవుడ్ యంగ్ హీరో ప్రియదర్శి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కమెడియన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రియదర్శి మల్లేశం సినిమాతో హీరోగా మారాడు. మల్లేశం సినిమా ప్రియదర్శికి నటుడుగా మంచి గుర్తింపు తెచ్చింది.ఆ తరువాత బలగం సినిమాతో ప్రియదర్శి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే ప్రియదర్శి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “డార్లింగ్” ..ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ప్రియదర్శి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్నడార్లింగ్ మూవీ ఓ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఇక ఈ మూవీ స్టోరీ హురించి చెప్పాలంటే హీరో చాలా అమాయకుడు, జీవితంలో అతని ఏకైక లక్ష్యం ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పారిస్‌లో హనీమూన్‌కి తీసుకెళ్లడం. అయితే, ఆనంది తన జీవితంలోకి భార్యగా ప్రవేశించడంతో అతని కలలు చెదిరిపోతాయి. అతని డ్రీమ్స్ ని చెదరగొడుతూ, ప్రతిరోజూ తనకి చుక్కలు చూపిస్తూ, అతన్ని కొడుతుంది..

Also Read: Darshan: దర్శన్ కేసుపై పుష్ప జాలిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. తమ్ముడిని అంటూనే!

తర్వాత ఏం జరుగుతుంది?,అనే నేపథ్యంగా తమిళ్ దర్శకుడు అశ్విన్ రామ్ తెరకెక్కిస్తున్నారు.పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ మూవీ హనుమాన్ ని అందించిన ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ కు చెందిన నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వివేక్ సాగర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో అనన్య నాగళ్ళ, మురళీధర్ గౌడ్, శివ రెడ్డి మరియు కృష్ణ తేజ వంటి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ ,గ్లింప్సె ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. అన్ని లాంఛనాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ జులై 19 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.

Exit mobile version