Premalo Papalu Babulu Motion poster: శ్రీ విజయ మాధవి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.1గా ప్రేమలో..’. ‘పాపలు బాబులు’ అనే ట్యాగ్ లైన్ తో సినిమా తెరకెక్కుతోంది. అభిదేవ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీరాజ్ బల్లా డైరెక్ట్ చేస్తున్నారు. విజయ మాధవి బల్లా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా మోషన్ పోస్టర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై మూవీ మోషన్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, నిర్మాత లయన్ సాయి వెంకట్,నటుడు సమీర్, నిర్మాత విజయ మాధవి, డైరెక్టర్ శ్రీరాజ్ బల్లా, హీరో అభిదేవ్, సినిమాటోగ్రాఫర్ వంశీ, ఎస్.జి..ఆర్, మ్యూజిక్ డైరెక్టర్స్ రవి బల్లా, ఫ్రాంక్లింగ్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
AP Congress: కాంగ్రెస్ అధికారంలోకి రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు..
ఈ సందర్బంగా మురళీ మోహన్ మాట్లాడుతూ ‘విజయ మాధవి బ్యానర్ అనే పేరు అద్భుతంగా ఉందని, మా శ్రీ రాజ్ మంచి దర్శక నిర్మాతగా నిలబడతాడని అన్నారు. కష్టపడి, ఇష్టపడి చేస్తే ఫలితం కచ్చితంగా వస్తుందన్న ఆయన ప్రేమలో పాపలు బాబులు అనే టైటిల్ కొత్తగా ఉందని, కాన్సెప్ట్ కూడా కొత్తగా, ఇంట్రెస్టింగ్‌గా అనిపించిందన్నారు. మా శ్రీరాజ్ సీరియల్స్ చేస్తూనే సినిమాలు కూడా చేస్తున్నారని అన్నారు. శ్రీరాజ్ మాట్లాడుతూ ‘నేను ఇది వరకు మురళీ మోహన్ గారిని రెండు సార్లు మాత్రమే కలిశాను ఆయన చాలా గొప్ప నటుడు, మంచి మనిషి అని అన్నారు. రవి బల్లా సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి డైలాగ్స్ హరి ఉప్పాడ అందిస్తున్నారు.