Prathinidhi 2 Movie Announcement: పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నారా రోహిత్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకొచ్చిన ఈ హీరో ఎంత త్వరగా సినిమాలు చేస్తూ వచ్చాడో అంత త్వరగా సైలెంట్ అయిపోయాడు. వరుసగా ఆటగాళ్లు, వీరభోగ వసంత రాయలు వంటి సినిమాలు నిరాశ పరచడంతో ఆయన సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి పండగలా వచ్చాడు, అనగనగా దక్షిణాదిలో, శబ్దం, మద్రాస్ వంటి సినిమాలు కూడా అనౌన్స్ చేశాడు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2024లో జరగబోతున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల టార్గెట్ గా నారా రోహిత్ నుంచి ఒక ఆసక్తికరమైన ప్రకటన వచ్చేసింది. అదేమిటంటే నారా రోహిత్ కెరీర్ లో విలక్షణమైన సినిమాగా పేరు తెచ్చుకున్న ప్రతినిధి సినిమాకి ఆయన సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ప్రతినిధి 2 పేరుతో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.
Priya Prakash Varrier: బీచ్లో బికినీతో రచ్చ చేసిన ప్రియా ప్రకాష్ వారియర్
టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న దాని మేరకు ఏపీ పొలిటికల్ వర్గాల్లో నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉండే మూర్తి అనే సీనియర్ జర్నలిస్ట్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నారు. మూర్తి గతంలో పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించారు కానీ ఇది దర్శకుడిగా ఆయనకు మొదటి సినిమా అని తెలుస్తోంది. 2024 ఎన్నికల్లోపు సినిమా షూటింగ్ పూర్తి చేసి ఎన్నికల ముందు రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే నారా రోహిత్ హీరోగా ఈ సినిమాని వానర ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక పోస్టర్లో చంద్రబాబు సిగ్నేచర్ అయిన విక్టరీ సింబల్ చూపించడం హాట్ టాపిక్ అవుతుంది. ఇక నిజానికి 2014 ఎన్నికల సమయంలో ప్రతినిధి సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు సుమారు 10 ఏళ్ల తర్వాత ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నారు. ఒక రకంగా అన్ని విషయాల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ పలుసార్లు ప్రచారం కూడా నిర్వహించిన నారా రోహిత్ ఇప్పుడు తన పెదనాన్న కోసం ఏకంగా సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతుండడం గమనార్హం.