Prashanth Varma Sensational Allegations about Hanuman Movie Release: టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రశాంత్ వర్మ పేరు హాట్ టాపిక్ అవుతోంది. సంక్రాంతికి ఆయన డైరెక్ట్ చేసిన హనుమాన్ సినిమా రిలీజ్ అవుతోంది. నిజానికి ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న సినిమాలన్నిటిలో ఈ సినిమా రిలీజ్ డేట్ నే ముందు ప్రకటించారు. అనుకున్నట్టుగానే జనవరి 12న హనుమాన్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. నిజానికి సంక్రాంతికి మరో 3-4 సినిమాలు కూడా వస్తున్నాయి. చివరి నిమిషంలో అయినా హనుమాన్ నిర్మాతలను ఒప్పించి పోస్ట్ పోన్ చేసేలా ఒప్పిస్తారేమో అనే అంచనాల నేపథ్యంలో అందరికంటే ముందు సెన్సార్ కంప్లీట్ చేసుకోవడం హాట్ టాపిక్ అయింది. అయితే తమ సినిమాను వాయిదా వేయించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ప్రశాంత్ వర్మ కామెంట్ చేశారు.
Nagarjuna: మొన్న చిరు నేడు నాగ్… సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని హీరో
ఆ వ్యక్తి ఎవరో మాకు తెలీదు , అలాగే ఎవరు చేయిస్తున్నారో కూడా మాకు ఐడియా లేదు కానీ మా సినిమాకి మాత్రం అడుగడుగునా అడ్డంకులు అయితే క్రియేట్ అవుతున్నాయి అని ఆయన అన్నాడు. రీసెంట్ గా సెన్సార్ విషయంలో కూడా అడ్డు పడ్డారు కానీ దేవుడి దయవల్ల అది పూర్తయిందని అన్నాడు. ఇక ప్రభాస్ ను సినిమా ప్రమోషన్స్ లో భాగం అయ్యేలా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నానని ప్రశాంత్ వర్మ పేర్కొన్నాడు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. జనవరి 12 ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది హనుమాన్. హను-మాన్ తెలుగు, హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో పాన్ వరల్డ్ విడుదల కానుంది.