Nagarjuna: మొన్న చిరు నేడు నాగ్… సతీసమేతంగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akkineni Nagarjuna Meets Telagana CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున దంపతులు కలిశారు. రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత నాగార్జున దంపతులు ఆయనను కలవడం ఇదే మొదటిసారి కాగా మర్యాదపూర్వకంగానే సీఎంను వారు కలిసినట్టు చెబుతున్నారు. ఈ క్రమంలో సీఎంకు వారు పుష్పగుచ్ఛం ఇచ్చి ఫొటోలు సైతం దిగారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి పలు రంగాలకు చెందిన ప్రముఖులు కలుస్తున్నారు. అయితే సినీ రంగం నుంచి మాత్రం ముందుగా చిరంజీవి కలువగా ఇప్పుడు అక్కినేని నాగార్జున దంపతులు కలిశారు.
KBC 15 : కేబీసీ 15ముగింపు.. ఏడుస్తూ వీడ్కోలు పలికిన అమితాబ్ బచ్చన్
Also Read
శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి చేరుకున్న నాగార్జున దంపతులు రేవంత్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అయనకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఆ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రేవంత్ సీఎం అయిన అనంతరం పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు రేవంత్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపేందుకు అపాయింట్మెంట్ కూడా అడిగారు. త్వరలోనే టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి వెళ్లి రేవంత్ కు శుభాకాంక్షలు తెలపనున్నారు. ఇక సీఎం రేవంత్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రజా పాలన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇక అక్కినేని నాగార్జున ‘నా సామిరంగ’ అనే సినిమాలో నటిస్తున్నారు. మూవీ ఫస్ట్ లుక్ టైటిల్ గ్లింప్స్‌తో అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజావార్తలు
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
ట్రెండింగ్
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?
-
350cc ఇంజిన్, 14.5 లీటర్ల ట్యాంక్, TFT డిస్ప్లేతో Triumph Bonneville T40 లాంచ్.. ధర ఎంతంటే?