Prashant Neel: ఎన్టీఆర్ ఫాన్స్‌కు బాడ్ న్యూస్.. ఇప్పట్లో నీల్ సినిమా లేనట్టే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NTR 31 Movie Updates: ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక సినిమా ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్లో తన 30వ సినిమాగా దేవర చేస్తున్నాడు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది యువసుధ ఆర్ట్స్ బ్యానర్ మీద మిక్కిలినేని సుధాకర్ తో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ మీద హరికృష్ణ కొసరాజు ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులకు ఎన్ని అంచనాలు ఉన్నాయో తెలియదు కానీ అంతకుమించి ప్రశాంత్ నీల్ సినిమా మీద ఉన్నాయి. అయితే ఆ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కి రిలీజ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ సినిమా చేస్తున్నాడు.
Salaar: రాసిపెట్టుకోండి.. ‘సలార్’ 2000 కోట్లు పక్కా!
Also Read
- Nani: నా కెరీర్లోనే అత్యంత కష్టమైన సినిమా ఇదే.. జడల బరువుపై నాని సంచలన వ్యాఖ్యలు!
- Nani: మా డైరెక్టర్ ఎవరినీ కొట్టలేదు.. నాని కీలక వ్యాఖ్యలు
- The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
- Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి 'హనుమాన్ అంశ్' - సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద అంచనాలను పెంచకపోగా ఇదేంట్రా ఇలా ఉంది టీజర్ అనే కొత్త చర్చకు దారి తీసింది. ఆ సంగతి పక్కన పెడితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు “సలార్” రెండవ భాగాన్ని వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు ప్రశాంత్ నీల్ సీరియస్ గా ఉన్నాడని అంటున్నారు. అయితే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ల సినిమా ప్రారంభం కాస్త ఆలస్యమైనా 2024లో జరుగుతుందనడంలో సందేహం లేదని అంటున్నారు. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ “సాలార్ 2” ఎప్పుడు విడుదల చేయాలనేది ఇంకా నిర్ణయించలేదు. మరోవైపు ఎన్టీఆర్ “ఎన్టీఆర్ 31” ప్రారంభించేలోపు “దేవర”, “వార్ 2” షూటింగ్‌లను సులభంగా పూర్తి చేస్తాడని అలా పూర్తి చేసి లాంగ్ బ్రేక్ తీసుకోనున్నారని అంటున్నారు. ఇక NTR 31 పూర్తిగా అబ్రాడ్ లో షూట్ చెయ్యబోతున్నారని సలార్ సెకండ్ పార్ట్ పూర్తి కాగానే ఐదు నెలల పాటు విదేశాల్లోనే #NTR31 ప్రీ-ప్రొడక్షన్ పనులు జరగనున్నాయని అంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా..? ఏఐతో అసలు సినిమా ముందుందా..?
-
OTR: దసరా కానుకగా కేబినెట్ విస్తరణ ఉంటుందా?
-
LG Smart TV: ఎల్జీ టీవీ ఆఫ్‌లో ఉన్నా ఆడియో రికార్డింగ్ జరుగుతోందా..? అసలు నిజమేంటి?
-
CM Revanth Reddy : ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణ నూతన విద్యావిధానం
-
Pakistan: బ్రిక్స్‌లో చేరేందుకు పాకిస్తాన్ తహతహ.. ‘ఛీ పొమ్మంటున్న’ భారత్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?