Salaar: రాసిపెట్టుకోండి.. ‘సలార్’ 2000 కోట్లు పక్కా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాల నష్టాలను పూడ్చేందుకు… ప్రభాస్ ఫ్యాన్స్ దాహం తీర్చేందుకు… ఈ సినిమా ఒక్కటి చాలు అనేలా థియేటర్లోకి రాబోతోంది సలార్. అసలు సలార్ బడ్జెట్‌కు వసూళ్లకు పదింతల తేడా ఉంటుందని బల్లగుద్ది మరీ చెబుతున్నారు ఈ సినిమాలో నటించిన నటీ నటులు. తాజాగా.. కమెడియన్ సప్తగిరి, ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లపై అప్పుడే ఓ అంచనాకు వచ్చేశాడు. ఖచ్చితంగా ఈ సినిమా 2 వేల కోట్లు వసూళ్లు చేస్తుందని చెప్పుకొచ్చాడు. సలార్ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేసిన జోష్‌లో సప్తగిరి ఈ ట్వీట్ చేశాడు. ‘ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సలార్ సినిమాకి సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశాను. ఈ సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అవుతుంది, బాక్సాఫీస్ దగ్గర 2000 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని నమ్ముతున్నాను. తనకు ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్, ప్రశాంత్ నీల్, హోంబలే ఫిలింస్‌కి థాంక్స్…’ అని సప్తగిరి ట్వీట్ చేశాడు.
#SALAAR 🔥🔥🔥Today, I finished dubbing for my role in the highly anticipated film #Salaar. it's going to be a #doubleblockbuster. I'm confident that it will surpass the ₹2000cr mark at the box office. Thanks to #Panworld⭐️ Our #RebelStar #Prabhas #Garu & Director #Prashanthneel… pic.twitter.com/l2TMTyHf6w
Also Read
- Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
- Varalaxmi Sarathkumar: "నాకు పిల్లలు పుట్టరని కాదు.. నేనే వద్దనుకున్నా"
- Rajamouli: "నేను 100% ఆశిస్తే.. మహేష్ 200% ఇచ్చాడు".. 'వారణాసి'పై రాజమౌళి సెన్సేషనల్ కామెంట్స్!
- Raja Karuppasamy: 'అంటే సుందరానికీ' అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
— Sapthagiri (@MeSapthagiri) July 8, 2023
ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. రీసెంట్‌గా రిలీజ్ అయిన టీజర్ దెబ్బకు సోషల్ మీడియా షేక్ అయిపోయిన సంగతి తెలిసిందే. రెండు రోజుల్లోనే 100 మిలియన్స్ వ్యూస్ క్రాస్ చేసి రికార్డ్ సృష్టించింది. ఇక టీజర్‌కు మించి ట్రైలర్ ఉంటుందని మేకర్స్ ప్రకటించడంతో.. సలార్ పై అంచనాలు పెరుగుతునే ఉన్నాయి. దానికి మరింత బూస్టింగ్ ఇచ్చేలా సప్తగిరి ఇచ్చిన హైప్ వేరే లెవల్లో ఉంది. అందుకే సలార్ రాక కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులతో పాటు, మ్యూజిక్ వర్క్స్‌తో బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. చెన్నైలో సంగీత దర్శకుడు రవి బసృర్ సలార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సౌండ్ మిక్సింగ్ పనులు చేస్తున్నారట. మరి ఇంత హైప్‌తో వస్తున్న సలార్.. సెప్టెంబర్ 28న ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్‌ప్లే, Dolby Vision, 65W సౌండ్!
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
-
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
-
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!