Prashanth Neel: సలార్.. సలార్ .. సలార్.. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దీని గురించే చర్చ నడుస్తోంది. ఆరేళ్ళ తరువాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. సలార్ సినిమాతో భారీ హిట్ ను అందుకున్నాడు. కెజిఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీని పాన్ ఇండియా లెవెల్లో నిలబెట్టిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమా రెండు రోజుల క్రితం రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు భారీ కలక్షన్స్ రాబడుతోంది. బాహుబలి తరువాత ప్రభాస్ హిట్ అందుకున్న సినిమా ఇదే అని చెప్పాలి. మొదటి రోజు దాదాపు 180 కోట్లు రాబట్టి 2023 బిగ్గెస్ట్ ఓపెనింగ్ రికార్డ్ ని సెట్ చేసిన ప్రభాస్.. సెకండ్ డే 145-150 కోట్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించిన నటులు కూడా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. ఈ సినిమాకోసం ప్రశాంత్ నీల్ తీసుకున్న పారితోషికం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.
బాహుబలి తరువాత నుంచి ప్రభాస్.. దాదాపు రూ. 100 కోట్ల వరకు పారితోషికం అందుకుంటూనే.. దాంతోపాటు అదనంగా లాభాల్లో వాటా కూడా అందుకుంటున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సలార్ కు కూడా అలాగే చేశాడని టాక్ నడుస్తోంది. ఇక ప్రభాస్ తరువాత అంతే రేంజ్ లో పారితోషికం అందుకున్నాడట ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు డైరెక్టర్ కు కూడా రూ. 100 కోట్లు ముట్టజెప్పారని అంటున్నారు. సినిమా కన్నా పారితోషికాలకే నిర్మాత బడ్జెస్ట్ ఎక్కువ పెట్టినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా ఈ రేంజ్ కలక్షన్స్ వచ్చేలా చేసి.. ప్రభాస్ కు హిట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్ కు ఎంత ఇచ్చినా తప్పులేదని అభిమానులు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వందకోట్లు.. రెండు భాగాలకు కలిపి ఇచ్చారా.. ? పార్ట్ 1 కే అంత తీసుకున్నాడా.. ? అనేది తెలియాల్సి ఉంది.