Ntrneel : జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. వీరిద్దరూ ఓ భారీ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోని పలు లొకేషన్లలో ఈ మూవీ షూట్ చేస్తున్నారు ప్రశాంత్ నీల్. అయితే షూటింగ్ నుంచి వీరిద్దరూ కొంచెం బ్రేక్ తీసుకున్నట్టు తెలుస్తోంది. శనివారం సాయంత్రం ఎన్టీఆర్ తన ఇంట్లో ప్రశాంత్ నీల్ కు స్పెషల్ పార్టీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సాయంత్రం కబుర్లు చెప్పుకుంటూ చిల్ అవుతున్న ఫొటోను ప్రశాంత్ నీల్ భార్య లిఖిత ఇన్ స్టాలో పోస్టు చేసింది. ఆ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Read Also : Kishan Reddy : డీలిమిటేషన్‌పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూపం బహిర్గతం
వీరిద్దరినీ ఇలా చూస్తే భయం అనేది మాత్రమే గుర్తుకు వస్తోంది అన్నట్టు ఆమె క్యాప్షన్ ఇచ్చారు. ఇంకేముంది ఈ ఫొటోను ఎన్టీఆర్ ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ.. మూవీ భారీ హిట్ ఖాయం అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్స్ కోసం జపాన్ కు వెళ్లారు. ప్రస్తుతం అక్కడ పర్యటిస్తున్నారు. ఆ తర్వాత వాళ్లు తిరిగి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చాక మళ్లీ ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొంటారు. ఇంకోవైపు వార్-2 మూవీ షూటింగ్ కూడా త్వరలోనే మళ్లీ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.