Hanu- Man: ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో సినిమాల పాన్-ఇండియా భాగస్వామ్య ప్రపంచం. హీరో తేజ సజ్జ నటించిన ‘హను-మాన్’ సినిమా ఈ యూనివర్స్ లో తొలి సినిమా. ఈ చిత్రం అన్ని భాషల ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందించడానికి రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా టీజర్‌తో మేకర్స్ యావత్ భారతాన్ని ఆశ్చర్యపరిచారు. టీజర్ లో ప్రతి ఫ్రేమ్ ఆకర్షణీయంగా ఉండటమే కాదు హనుమంతుని సన్నిధి గూస్‌బంప్ తెప్పించింది.
ప్రస్తుతం ‘హను-మాన్’ టీమ్ ముంబైలో అండర్ వాటర్ సీన్ షూటింగ్‌లో ఉంది. ప్రశాంత్ వర్మ విజన్ కి అనుగుణంగా దీనిని తెరకెక్కిస్తున్నారు. పర్ఫెక్షనిస్ట్ ప్రశాంత్ వర్మఈ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లో పదిహేను రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించారు. ఈ సన్నివేశం కోసం తేజ ఊపిరి తీసుకోకుండా నీటిలో ఉండవలసి ఉంటుంది. దీని అవుట్‌పుట్ ప్రేక్షకులని థ్రిల్ కి గురిచేస్తుందంటున్నారు. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కె.నిరంజన్ రెడ్డి నిర్మాత. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్‌గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్‌గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ సినిమా విడుదల తేదీ ప్రకటిస్తామంటున్నారు దర్శకనిర్మాతలు.