Prasanth Varma: హనుమాన్.. సినిమా రిలీజ్ అయ్యి దాదాపు పది రోజులు దాటింది. అయినా కూడా దాని ఇంపాక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది. కలక్షన్స్ రాబడుతూనే ఉంది. రికార్డులను బద్దలు కొడుతూనే ఉంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి .. భారీ విజయాన్ని అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంత తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ చూపించిన విజువల్స్ కు అయితే అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఈ రోజుకి 250 కోట్ల రూపాయలు గ్రాస్ ప్రపంచవ్యాప్తంగా వసూలు చేసినట్లు సినిమా యూనిట్ ప్రకటించి ఒక గ్రాటిట్యూడ్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ గ్రాటిట్యూడ్ మీట్లో ముఖ్యఅతిథిగా చిలుకూరు బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు రంగరాజన్ పాల్గొన్నారు.
ఇక ఈ ఈవెంట్ లో ప్రశాంత్ వర్మ ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడడం ఆసక్తి కలిగిస్తుంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్.. ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి ఈ సినిమాను బాలీవుడ్ మేకర్స్ నిర్మించారు. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ చిత్రం భారీ పరాజయాన్ని అందుకుంది. ఇక ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ గుర్తుచేశాడు. ” ఆదిపురుష్ సినిమా చూసాను.. అందులో నాకు కొన్ని సీన్స్ నచ్చాయి.. ఇంకొన్ని సీన్స్ తెరకెక్కించిన విధానం మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. నేనే కనుక ఆదిపురుష్ తీసి ఉంటే.. అంతకన్నా బాగా తీసేవాడిని.. నాకు అదే అనిపించింది. ఆదిపురుష్ చూసాకా నాకే కాదు ఏ ఫిల్మ్ మేకర్ కు అయినా అలాంటి భావనే కలుగుతుంది. ఇక ఆదిపురుష్ సినిమా రిజల్ట్.. నా మీద ఎలాంటి ప్రభావం చూపించలేదు. నా టీమ్ నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు. వారివలనే హనుమాన్ నేను అనుకున్నట్లు తీర్చిదిద్దగలిగాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.