Pradeep Machiraju Releases A Song :
‘శుక్ర’ దర్శకుడు సుకు పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా ‘మాటరాని మౌనమిది’. మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీని రుద్ర పిక్చర్స్, పిసిర్ గ్రూప్ సమర్పణలో వాసుదేవ్ నిర్మిస్తున్నారు. లవ్, థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లొ మల్టీ జోనర్స్ తో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఆగస్ట్ లో మూవీని దర్శక నిర్మాతలు రిలీజ్ చేయబోతున్నారు. దాంతో మూవీ ప్రమోషన్స్ నూ ప్రారంభించారు. అందులో భాగంగా ఈ సినిమాలోని ‘ఈ రోజేదో….’ అనే లిరికల్ సాంగ్ ను యంగ్ హీరో, పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో విడుదల చేయించారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ, ”నేను కూడా ఈ టీమ్ లో భాగమే అనుకుంటాను.

ఈ పాట విడుదల చేయడం సంతోషంగా ఉంది. మంచి ట్యూన్ తో పాటు దర్శకుడు సుకు పూర్వాజ్ కొత్త కాన్సెప్ట్ తో ఈ పాటను పిక్చరైజ్ చేశారు. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ పాటతో పాటు త్వరలో విడుదల కాబోతున్న సినిమా కూడా సక్సెస్ కావాలి” అని అన్నారు. ఈ పాటకు అషీర్ లూక్ స్వరాలు అందించగా, డాక్టర్ వాసుదేవ్ సాహిత్యాన్ని సమకూర్చారు. ఆషీక్ అలీ, సోనీ కొమాండూరి పాడారు. ప్రేమికుడి లవ్ ఫీలింగ్స్ చెబుతూ సాగే ఈ పాట యువతను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో మహేష్ దత్త, సోని శ్రీవాస్తవ, అర్చన అనంత్, సుమన్ శెట్టి, సంజీవ్ , శ్రీహరి తదితరులు కీలక పాత్రలు పోషించారు.