స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం తన అప్ కమింగ్ చిత్రాలైన ‘సలార్’, ‘ఆదిపురుష్’ షూటింగ్స్ తో బిజీగా ఉన్నాడు. ‘బాహుబలి’తో ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్ కి దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. అయితే ప్రభాస్ తాజా లుక్ సోషల్ మీడియాలో ట్రోల్ కి గురవుతోంది. ఇటీవల కాలం వరకూ ప్రభాస్ ను హీమ్యాన్ గా కీర్తించారు ప్రేక్షకులు. ఏమైందో ఏమో ఈ మధ్య వెయిట్ పెరిగి కొంచెం ఏజ్ డ్ పర్సన్ లా కనిపిస్తున్నాడు. అదే ఇప్పుడు ఈ ట్రోల్స్ కి కారణం అవుతోంది. ‘ఆదిపురుష్’ పని మీద ముంబైలో ఉన్నాడు ప్రభాస్. ఈ సినిమా పాట రిహార్సల్స్ కోసం ఆక్కడ ఉన్నాడు. ఈ సందర్భంగా పాపరాజీ మీడియా కంట పడ్డాడు ప్రభాస్. ఆటైమ్ లో ప్రభాస్ మేకప్ లో కూడా లేడు. దాంతో మరీ దారుణంగా ఆడుకుంటున్నారు నెటిజన్స్.
Read Also : “బిగ్ బాస్-5” సందడికి టైం ఫిక్స్
ఓ యూజర్ ఏకంగా ‘ప్రభాస్ 50 సంవత్సరాల అంకుల్ లా కనిపిస్తున్నాడు. మేకప్ లేకుండా చూడటానికి ఇబ్బందికరంగా ఉంది’ అనేశాడు. మరొకరు మిల్క్ మేన్ లా కనిపిస్తున్నాడని, ముసలివానిలా కనిపిస్తున్నాడని ఇలా రకరకాల కామెంట్స్ చేసేశారు. నిజానికి ఉత్తరాది ప్రేక్షకులు దక్షిణాది తారలను లుక్, ఫిజిక్ విషయంలో ట్రోల్ చేయడం ఇదే మొదటిసారి కూడా కాదు. అయితే ప్రభాస్ పై వస్తున్న ట్రోల్స్ కి అతని అభిమానులు సోషల్ మీడియాలో గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఆదిపురుష్’ లో కృతి సనన్ సీతగాను, సైఫ్ అలీ ఖాన్ రావణాసురునిగా కనిపించనున్నారు. మన హీరోలు టైమ్ వచ్చినపుడు పాత్రలకు అనుగుణంగా పరకాయ ప్రేవేశం చేయటంలో నిష్టాణుతులు. ప్రభాస్ కూడా తన పాత్రకు తగినట్లు మోల్డ్ అయి పూర్తి స్థాయి ఫిట్ నెస్ లో ట్రోల్స్ కి పుల్ స్టాప్ పెడతాడేమో చూద్దాం.