Prabhas : ప్రభాస్ ఈమధ్య చాలా సినిమాలకు హెల్ప్ చేస్తున్నాడు. అదేంటో గాని ప్రభాస్ చేయి పడితే అన్ని సినిమాలు హిట్ అయిపోతున్నాయి. మొన్నటికి మొన్న మిరాయి సినిమాకు వాయిస్ ఓవర్ ఇస్తే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ప్రభాస్ వాయిస్ తోనే ఆ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. అంతకుముందు కన్నప్ప సినిమాలో కీలక పాత్ర చేశాడు. ఎన్నో ఏళ్లుగా హిట్టు లేక అల్లాడుతున్న మంచు విష్ణుకు ఆ మూవీతో భారీ హిట్టు దక్కింది. ఇప్పుడు మరో సినిమాలో ప్రభాస్ చేయి పడబోతోంది.
Read Also : OG : రేపు ఓజీ ఈవెంట్ లో పవన్ కల్యాణ్.. ఫ్యాన్స్ గెట్ రెడీ
అది ఏదో కాదు.. రిషబ్ శెట్టి హీరోగా వస్తున్న కాంతార 1. ఈ సినిమా ట్రైలర్ ను రేపు ప్రభాస్ రిలీజ్ చేయబోతున్నాడు. మరి ప్రభాస్ సెంటిమెంట్ ఈ సినిమాకు కూడా వర్కౌట్ అయితే.. మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో అని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు కడుతున్నారు. అసలే కాంతార పెద్ద హిట్ కావడంతో.. ఈ సీక్వెల్ పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ప్రభాస్ ఫ్యాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ తీసుకువస్తే కలెక్షన్ల ఊచకోత ఖాయమంటున్నారు.
