Site icon NTV Telugu

Kantha : దుల్కర్ సల్మాన్ కు ప్రభాస్ సాయం.. సెంటిమెంట్ కోసమా

444

444

Kantha : స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘కాంత’ నుండి అద్భుతమైన అప్‌డేట్ వచ్చింది. ఈ చిత్రానికి దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్. తాజాగా, ఈ మూవీ ట్రైలర్‌ను రెబల్ స్టార్ ప్రభాస్ విడుదల చేయనున్నారని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు ట్రైలర్ రాబోతోంది. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో 1960స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోంది. ముందుగా తొలిమెరుపు ఉండబోతుందని తెలియజేసిన మేకర్స్‌ ట్రైలర్‌ అప్‌డేట్ చెబుతూ స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మూవీ నవంబర్ 14న రిలీజ్ కానుంది.

Read Also : SSMB 29 : రాజమౌళి-మహేశ్ మూవీపై క్రేజీ అప్డేట్

ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 1960ల నాటి పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కాలానికి తగ్గ సెట్‌లు, కాస్ట్యూమ్స్, మరియు విజువల్స్ తో ప్రేక్షకులను ఆ కాలంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. దుల్కర్ ఈ మధ్య చేస్తున్న సినిమాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక ప్రభాస్ సాయం చేస్తున్న సినిమాలు దాదాపు అన్నీ హిట్లు కొట్టేస్తున్న సంగతి తెలిసిందే కదా. మిరాయ్, కాంతార సినిమాలు ఇప్పటికే బ్లాక్ బస్టర్లు అయ్యాయి. అదే సెంటిమెంట్ కోసం ప్రభాస్ తో రిలీజ్ చేయిస్తున్నారా అనే టాక్ నడుస్తోంది.

Read Also :Malaika Arora : నచ్చిన వాళ్లతో శృంగారం చేస్తే తప్పేంటి.. నటి షాకింగ్ కామెంట్స్

Exit mobile version