Prabhas: ప్రభాస్‌కు అరుదైన గౌరవం.. సౌతిండియాలోనే ఈ అవకాశం దక్కించుకున్న తొలి హీరో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas: టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌కు అరుదైన గౌరవం దక్కింది. దసరా ఉత్సవాల్లో భాగంగా ఢిల్లీ రామ్ లీలా మైదానంలో జరిగే రావణాసుర దహన కార్యక్రమానికి నిర్వాహకులు ప్రభాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. రావణ దహనం చేసేందుకు ‘ఆదిపురుష్’లో రాముడిగా కన్పించే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను మించిన అతిథి మరొకరు ఉండరని నిర్వాహకులు అభిప్రాయపడుతున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కంటే మరో హీరో పేరు కూడా తమకు ప్రత్యామ్నాయంగా కనిపించడం లేదని వాళ్లు అంటున్నారు. నిర్వాహకుల ఆహ్వానం సంగతి ఎలా ఉన్నా ప్రస్తుతం తన జీవితంలో పెద్దదిక్కైన పెదనాన్న కృష్ణంరాజును కోల్పోయిన బాధలో ఉన్న డార్లింగ్ వచ్చే నెలలో జరిగే ఈ కార్యక్రమానికి వెళ్తాడా? లేదా అనేది తెలియాల్సి ఉంది.
Read Also:God Father: ‘జై దేవ్’గా సత్యదేవ్.. ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
Also Read
- Nani: నాని దర్శకత్వంలో సినిమా? హీరో కాకముందే పూర్తి స్క్రిప్ట్ రాసిపెట్టుకున్న న్యాచురల్ స్టార్!
- Chiranjeevi : బ్లడ్ అమ్ముకున్నానని అవమానించారు..
- Mohan Babu: "ఆ సినిమా చూస్తే మీరు నా దగ్గరకు కూడా రారు.." మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Kayadu Lohar: పురాణాల్లోని ఆ రాక్షసుడి భార్య పేరు నాకు పెట్టారు.. తండ్రి చేసిన పనిని బయటపెట్టిన కయాదు!
ప్రతి ఏడాది దేశ రాజధాని ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ ఆవరణలో అత్యంత వైభవంగా దసరా పండగ వేడుకలు నిర్వహిస్తుంటారు. ఢిల్లీ లవ్ కుశ్ రామ్‌లీలా కమిటీ ఈ వేడుకలను నిర్వహిస్తుంది. వేడుకల ముగింపురోజు నాడు రావణాసురుడి దిష్టిబొమ్మను దగ్ధం చేయడం ఈ కమిటీ ఆనవాయితీ. గడ్డి, ఇతర వస్తువులతో తయారు చేసిన 10 తలల రావణాసురుడి భారీ విగ్రహాన్ని దగ్ధం చేయడానికి సెలబ్రిటీలను కమిటీ ఆహ్వానిస్తుంటుంది. అయితే రావణాసుర దహన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న తొలి సౌతిండియా స్టార్ ప్రభాస్ మాత్రమే అని తెలుస్తోంది. గతంలో బాలీవుడ్ హీరోలు అజయ్ దేవ్‌గణ్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహంలకు మాత్రమే ఈ అవకాశం దక్కింది. కాగా ఈ ఏడాది వేడుకలలో అయోధ్యలో వైభవంగా రూపుదిద్దుకుంటోన్న రామాలయాన్ని బ్యాక్‌గ్రౌండ్ సెట్స్ వేస్తామని నిర్వాహకులు వెల్లడించారు. చెడుపై మంచి విజయానికి చిహ్నంగా రావణుడి దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు ఆదిపురుష్‌లో రాముడిగా నటిస్తున్న ప్రభాస్ కంటే మెరుగైన వారు ఎవరుంటారని లవ్‌కుశ్ రాంలీలా కమిటీ చీఫ్ అర్జున్ కుమార్ పేర్కొన్నారు. అటు ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది.
తాజావార్తలు
-
Iran-Trump: హార్ముజ్‌పై ట్రంప్ ముందు ఇరాన్ కీలక ప్రాతిపాదన.. స్పందన ఎలా ఉంటుందో..!
-
Mark Wood Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఫాస్ట్ బౌలర్..
-
Muslim CM Demand: యూపీకి ముస్లిం సీఎం కావాలి.. అఖిలేష్‌కు షహబుద్దీన్ అల్టిమేటం..
-
Supreme Court: వందేమాతరం వివాదం వేళ 1986 తీర్పు ప్రస్తావన.. ఆనాడు సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇచ్చిందంటే..!
-
AI fraud: 65 ఏళ్ల మహిళ.. 29 ఏళ్ల డాక్టర్‌గా AI మోసం! వ్యాపారవేత్తకు భారీ టోకరా
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!