Prabhas: ఈ సినిమాలో నేనే ఓ పెద్ద కమెడియన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prabhas:ఎట్టేకలకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూసిన క్షణం రానేవచ్చింది. ప్రాజెక్జ్ కె లో కె అంటే ఏంటో తెలిసిపోయింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. అమెరికాలో జరిగిన శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో కె అంటే కల్కి2898AD అని చెప్పుకొచ్చేశారు. దాంతో పాటు ఫస్ట్ గ్లింప్స్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. ఎన్నో ఏళ్ళు పస్తులు ఉండి ఆహారం కోసం ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఒక్కసరిగా చికెన్, మటన్ బిర్యానీ ఎదురుగా పెట్టినట్లు ఉంది ఆ గ్లింప్స్. ఎంతో పవర్ ఫుల్ గా ప్రభాస్.. అంతకంటే ఎక్కువ స్టైలిష్ గా కనిపించాడు. ఒక సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి సినిమాల పరాజయంతో విసిగిపోయిన అభిమానులకు ఈ గ్లింప్స్ ఊపిరి పోసింది. చాలు సామీ.. చాలు.. ఈ ఒక్క గ్లింప్స్ తో సినిమా వచ్చేవరకు బతికేస్తాం. దీనిపై అంచనాలు పెట్టుకున్నా పర్లేదు అని నమ్మకంగా చెప్పేస్తున్నారు. ఇక శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రభాస్ ఈ సినిమా గురించి మాట్లాడి మరింత హైప్ పెంచాడు.
Vishwak Sen vs Sai Rajesh:నో అంటే నో..అది మగాళ్ళకి కూడా.. బేబీ డైరెక్టర్ కి విశ్వక్ కౌంటర్లు?
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
అందరు అనుకున్నట్టుగానే ఈ సినిమా ఒక సూపర్ హీరో సినిమా అని చెప్పుకొచ్చాడు. నాగ్ అశ్విన్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించినట్లు తెలిపాడు. అయితే సూపర్ హీరో అంటే చాలా సీరియస్ గా ఉంటాడు. కానీ, కల్కిలో మాత్రం సూపర్ హీరో హిలేరియస్ గా నవ్విస్తాడు అని చెప్పుకురావడం విశేషం. “కల్కి2898AD లో హీరో సూపర్ హీరో.. ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే.. అతను చాలా ఫన్నీ. నాగీ.. ఆ పాత్రను అలా డిజైన్ చేయడం నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి.. మొత్తం ప్రాజెక్ట్ కె లో అతనే ఫన్నీ గాయ్. ఎన్నో ఎమోషన్స్ ను కూడా అందులో చూపించారు. ఈ సినిమాలో నేనే ఓ పెద్ద కమెడియన్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Prabhas on his character bringing the humor in #Kalki2898 AD #SDCC 2023 pic.twitter.com/tAqpF1iOT6
— Deadline (@DEADLINE) July 21, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..