Site icon NTV Telugu

Prabhas: ‘బైకర్’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!

Prabhas, Sharwanand, Biker, Malavika Nair, Rajasekhar, Biker Movie, Prabhas Biker Trailer Reaction

Prabhas, Sharwanand, Biker, Malavika Nair, Rajasekhar, Biker Movie, Prabhas Biker Trailer Reaction

టాలీవుడ్ యంగ్‌స్టర్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం బైకర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రంతో ప్రేక్షకులను అలరించి సక్సెస్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్, ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్స్‌ ఆఫ్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది.

Also Read: Dhurandhar 2: పాకిస్థాన్‌లో ‘ధురంధర్’ సెగ.. ఒక్కసారిగా మొదలైన కలకలం!

ఈ ట్రైలర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేసిన ప్రభాస్, ఇది చాలా ఎంగేజింగ్‌గా ఉందని, సినిమా వైబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అలాగే ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ లాంటి అగ్ర హీరో నుంచి ప్రశంసలు దక్కడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టాడు డార్లింగ్. కుదిరితే ఈ సినిమా ఈవెంట్స్‌కు ప్రభాస్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్‌తో ఇంటర్య్వూ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్‌తో కలిసి ఆయన చేసిన సందడి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తుండగా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘బైకర్’ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Krishna Burugula: నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డ్‌తో సంచలనం

 

Exit mobile version