Prabhas: ‘బైకర్’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్‌స్టర్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం బైకర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రంతో ప్రేక్షకులను అలరించి సక్సెస్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్, ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో దూసుకెళ్తోంది. యాక్షన్, ఎమోషన్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్ కలగలిపిన ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను మరింత పెంచింది.
Also Read: Dhurandhar 2: పాకిస్థాన్‌లో ‘ధురంధర్’ సెగ.. ఒక్కసారిగా మొదలైన కలకలం!
Also Read
- Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
- Hanuman Sentiment: గురూజీకి కలిసిరాని హనుమాన్ సెంటిమెంట్! రెండోసారీ అదే సీన్ రిపీట్..
- Dancers Association: డాన్సర్స్ యూనియన్ ఎన్నికలపై హైకోర్టు స్టే!
- Senior Star Heroes Movies: ప్లానింగ్ లోపమా..? ఓటీటీ నిబంధనలా..? విచిత్ర డైలమాలో సీనియర్ స్టార్స్ సినిమాలు.!
ఈ ట్రైలర్‌పై పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ట్రైలర్‌ను షేర్ చేసిన ప్రభాస్, ఇది చాలా ఎంగేజింగ్‌గా ఉందని, సినిమా వైబ్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. అలాగే ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ లాంటి అగ్ర హీరో నుంచి ప్రశంసలు దక్కడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రభాస్ హోమ్ బ్యానర్ యువీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఇప్పటి నుంచే ప్రమోషన్స్ మొదలు పెట్టాడు డార్లింగ్. కుదిరితే ఈ సినిమా ఈవెంట్స్‌కు ప్రభాస్ గెస్ట్‌గా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. చిత్ర యూనిట్‌తో ఇంటర్య్వూ చేసే ఛాన్స్ కూడా లేకపోలేదు. ఇటీవల ‘కపుల్ ఫ్రెండ్లీ’ టీమ్‌తో కలిసి ఆయన చేసిన సందడి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తుండగా మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరి తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానున్న ‘బైకర్’ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Also Read: Krishna Burugula: నాడు సవాల్.. నేడు గద్దర్ అవార్డ్‌తో సంచలనం
తాజావార్తలు
-
Harish Rao : తుగ్లక్ నిర్ణయాలతో బొగ్గు ఉత్పత్తి పడిపోయింది..
-
TG SAFE : పండుగ వేళ అప్రమత్తమైన TG SAFE, ఎన్ఫోర్స్మెంట్ బృందాలు
-
El Nino: ‘ఎర్రగా మారిన ప్రపంచం’.. ‘‘సూపర్-డూపర్ ఎల్ నినో’’ ముప్పు.!
-
Chiru – Odela: శ్రీకాంత్ ఓదెలకు చిరంజీవి హ్యాండ్ ఇచ్చారా? నాని మాటల్లో మతలబు ఇదేనా!
-
Stock Market: స్టాక్ మార్కెట్లో బ్లడ్‌బాత్.. ఇన్వెస్టర్లకు చుక్కలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!