Dhurandhar 2: పాకిస్థాన్‌లో ‘ధురంధర్’ సెగ.. ఒక్కసారిగా మొదలైన కలకలం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘ధురంధర్ 2’ సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కావు. ఈ సినిమా విడుదల తర్వాత సరిహద్దు అవతల పాకిస్థాన్‌లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ముఖ్యంగా కరాచీలోని అత్యంత రద్దీగా ఉండే లియారి ప్రాంతంలో ఇప్పుడు పరిస్థితి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. భారతీయ గూఢచారులు తమ మధ్యే ఉన్నారనే భయంతో స్థానికులు, పోలీసులు కలిసి జల్లెడ పడుతుండటం గమనార్హం. సాధారణంగా గ్యాంగ్ వార్లకు, ఫుట్‌బాల్ క్రేజ్‌కు పేరుగాంచిన లియారి ప్రాంతం ఇప్పుడు ‘స్పై హంట్’కు వేదికైంది. ధురంధర్ సిరీస్ ప్రభావంతో అక్కడి ప్రజల్లో ఒక రకమైన అభద్రతా భావం పెరిగిపోయింది. ప్రతి వీధిలోనూ, ప్రతి సందులోనూ అనుమానితుల కోసం పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్థానిక ప్రజలు కూడా పోలీసులతో చేతులు కలిపి, కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే వారిని ప్రశ్నిస్తూ విచారణ చేపడుతున్నారు.
Also Read: IPL 2026 vs Peddi: ఐపీఎల్ ఫీవర్ మధ్య రిలీజ్.. రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాకి అసలైన పరీక్ష తప్పదా?
Also Read
- Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన 'యశ్ టాక్సిక్'
- Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
- NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
- Celebrity Marriage: తమ్ముడితో హీరోయిన్గా నటించి.. అన్నను పెళ్లాడిన భామలు వీరే! ఈ లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ వీడియోలు ఇప్పటివా? గతంలోనివా? అనే క్లారిటీ లేకుండాపోయింది. కానీ, ఈ గాలింపు చర్యల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం మాత్రం భారత గూఢచారి హమ్జా అలీ మజారి అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ధురంధర్‌లో ఇండియన్ స్పైగా నటించిన రణ్‌వీర్ సింగ్ పాత్ర పేరు ‘హమ్జా అలీ మజారి’. ఇప్పుడు పాకిస్తానిలు చేస్తున్న స్టంట్ చూస్తుంటే.. హమ్జా అలీ మజారినే పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది వ్యవహారం అంటూ.. నెట్టింట సెటైర్స్ పేలుతున్నాయి. అయినా, ధురంధర్ చిత్రంలో చూపించిన సన్నివేశాలు నిజజీవితంలోనూ జరుగుతున్నాయన్న భయం అక్కడి భద్రతా సంస్థలకు ఇప్పుడు రావడం విశేషం. లియారి ప్రాంతంలోని సామాన్య పౌరులు తమ ఇరుగుపొరుగు వారిని కూడా అనుమానపు చూపులతో చూసే పరిస్థితి నెలకొంది. అయినా సినిమాలో చూసిన కల్పిత పాత్రలతో పాటు మన ఒరిజినల్ స్పై ఏజెంట్‌లను ఇప్పుడు పట్టుకుంటామంటే.. పాకిస్తానీ జనాలు సైతం ఆశ్చర్యపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా.. పాకీలంటే ఆ మాత్రం ఉంటది మరి!
తాజావార్తలు
-
Toxic : వంద కోట్ల గ్రాస్ కూడా రాబట్టలేక షాకిచ్చిన ‘యశ్ టాక్సిక్’
-
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
-
Kranti Goud: నెం.11 స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి చరిత్ర సృష్టించిన క్రాంతి గౌడ్..!
-
Gandhari vs Toxic: ‘గాంధారి’ని చూసి నేర్చుకోవాలి.. ‘టాక్సిక్’ హీరోయిన్స్ పై నెటిజన్స్ కౌంటర్లు ..
-
NBK 111 : ఫ్యామిలీ మెంబర్స్, డాక్టర్స్ మాట బాలయ్య వినడం లేదా?
ట్రెండింగ్
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!