Spirit : చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న సినిమా స్పిరిట్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో స్టార్ట్ కావాల్సింది. కానీ ఎందుకో డిలే అవుతూ వచ్చింది. దీంతో అసలు సినిమా ఉంటుందా లేదా అనే డౌట్లు అందరికీ మొదలయ్యాయి. తరచూ వాయిదాలు పడటంతో ఫ్యాన్స్ అసంతృప్తికి గురయ్యారు. ఈ రూమర్లకు చెక్ పెడుతూ తాజాగా సందీప్ రెడ్డి వంగా మూవీ షూటింగ్ పై క్లారిటీ ఇచ్చారు. జిగ్రీస్ మూవీ సక్సెస్ ఈవెంట్ కు వచ్చిన సందీప్ రెడ్డికి స్పిరిట్ గురించి ప్రశ్నలు వచ్చాయి.
Read Also : Raju Weds Rambai : రాజు వెడ్స్ రాంబాయి ట్రైలర్ రిలీజ్.. ఎలా ఉందంటే..?
దీనిపై ఆయన స్పందిస్తూ.. ఈ నెలాఖరుకు స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో మూవీపై ఇప్పటి వరకు ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు అయిపోయాయి. ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్, ఫౌజీ సినిమా షూటింగుల్లో ఫుల్ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే కదా. ఈ రెండు సినిమాల్లో బిజీగా ఉన్నాడు స్పిరిట్ ఇంకా లేటవుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ స్పిరిట్ ఈ నెలాఖరుకు స్టార్ట్ అవుతుందని సందీప్ ఈవెంట్ లో స్వయంగా చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Read Also : Rashmika : అందుకే ఇంటర్వ్యూలకు రాను.. ట్రోల్స్ పై రష్మిక రియాక్ట్