Spirit : హీరో ప్రభాస్- డైరెక్టర్ సందీప్‌రెడ్డి వంగా కాంబినేషన్‌లో ‘స్పిరిట్’ సినిమా తెరకెక్కనుంది. ఈ మూవీ ప్రకటన వెలువడిన క్షణం నుంచే అభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అని కొంతకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసిన సందీప్.. లొకేషన్స్ ఫిక్స్ చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ కోసం మెక్సికోలో కొన్ని ప్రాంతాలు పరిశీలిస్తున్నామని, అక్కడే షూటింగ్ ప్రారంభిస్తామని గతంలో సందీప్ తెలిపాడు. ఇప్పటికే ఈ సినిమా సంగీత చర్చలు కూడా మొదలయ్యాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ స్వరాలు సమకూరుస్తున్నారు. ప్రభాస్ తన కెరీర్‌లో తొలిసారి పోలీసు అధికారిగా నటించనున్నారు.
Read Also : Baahubali Epic : బాహుబలి కోసం రంగంలోకి అనుష్క శెట్టి.. జక్కన్న మాస్టర్ ప్లాన్
అయితే.. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 5 నుంచి ప్రారంభం కానుందని సోషల్ మీడియా చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో మళయాళం నటి మడొన్నా సెబాస్టియన్ కీలక పాత్ర పోషించనుందట. మరో కిక్కిచ్చే న్యూస్ ఏంటంటే.. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించనున్నారని చర్చ జోరందుకుంది. తాజాగా మరో బిగ్ అప్డెట్ వచ్చింది. బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించనున్నాడని సమాచారం. 2002లో తెరకెక్కిన ‘కంపెనీ’తో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు వివేక్ ఒబెరాయ్. ఆ సినిమా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ‘రోడ్’, ‘సాథియా’, ‘యువ’, ‘ఓంకార’, ‘క్రిష్ 3’, ‘లూసిఫర్’ వంటి చిత్రాల్లో ఆయన నటించారు. వర్మ తెరకెక్కించిన ‘రక్త చరిత్ర’తో ఆయన తెలుగువారికి సుపరిచితులయ్యారు. వివేక్ కీలకపాత్ర పోషించిన ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ సిరీస్ ఈ ఏడాదిలో విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది.