Site icon NTV Telugu

Spirit : స్పిరిట్ ఇంకెప్పుడు.. ఏంటి వంగా భయ్యా ఇది..

Spirit

Spirit

Spirit : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వస్తున్న స్పిరిటి మూవీ కోసం ఫ్యాన్స్ ఓ రేంజ్ లో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సినిమా చరిత్రలో ఓ సంచలనం అవుతుందనే అంచనాలో అందరితోనూ ఉన్నాయి. పైగా ప్రభాస్ ఇందులో ఫస్ట్ టైమ్ పోలీస్ పాత్రలో కనిపిస్తాడనే ప్రచారంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కానీ గతేడాది నుంచి ఊరిస్తున్నారే తప్ప మూవీ అప్డేట్ మాత్రం ఇవ్వట్లేదు. అసలు ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

Read Also : ఒంటెకాళ్లు అంటూ వెక్కిరించారు.. ప్రభాస్ హీరోయిన్ ఎమోషనల్

ఇదిగో ఇప్పుడు.. అప్పుడు అనడమే తప్ప అసలు మూవీ అప్డేట్ మాత్రం రావట్లేదు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లోనే స్టార్ట్ అవుతుందని సందీప్ ప్రకటించాడు. కానీ ఇప్పటికీ ఉలుకు పలుకు లేదు. ఫౌజీ, ది రాజాసాబ్ సినిమా షూటింగుల్లో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉంటున్నాడు. కానీ ఈ సినిమా మాత్రం పట్టాలెక్కట్లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో సందీప్ మాత్రం క్లారిటీ ఇవ్వట్లేదు. సందీప్ ఈ సినిమా కోసం త్రిప్తి డిమ్రీని తీసుకున్నాడు. అంతకు మించి ఒక్క అప్డేట్ కూడా ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.

Read Also : Chiranjeevi : వీసీ సజ్జనార్ ను కలిసిని మెగాస్టార్ చిరంజీవి

Exit mobile version