కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి… ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ఫస్ట్ లుక్ తో స్టార్ట్ అయిన సలార్ ప్రమోషన్స్… టీజర్ తో పీక్స్ కి వెళ్లిపోయింది. రీసెంట్ గా సలార్ ట్రైలర్ బయటకి వచ్చి పెను తుఫాన్ సృష్టించింది. ‘డార్క్ సెంట్రిక్ థీమ్’తో రూపొందుతున్న ‘సలార్’ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.
కలెక్షన్స్ కి ఒక కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చెయ్యగల సత్తా ఉన్న సలార్ మూవీ.. సరిగ్గా మరో వంద ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ 2 వీక్స్ ఫర్ సలార్… రెండు వారాల్లో సలార్ వస్తుంది అంటూ సోషల్ మీడియాలో సలార్‌ను ట్రెండ్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. డిసెంబర్ 15 నుంచి బుకింగ్స్ కూడా ఓపెన్ అవనున్నాయి కాబట్టి సలార్ మేనియా మరింత పెరగనుంది. అలాగే త్వరలో సలార్ నుంచి సాంగ్ ని కూడా రిలీజ్ చేస్తే సలార్ సినిమాని బాక్సాఫీస్ దగ్గర ఆపడం కష్టమే. వన్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరిగితే… సలార్ బాక్సాఫీస్ ఊచకోత నెక్స్ట్ లెవల్‌కి వెళ్లడం గ్యరెంటీ. ఏదేమైనా మరో రెండు వారాల్లో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సలార్ అనే భారీ తుఫాన్ రాబోతోందని చెప్పొచ్చు.