Prabhas : ‘ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే’.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ఫౌజీ’. పిరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. అయితే ఈ సినిమా సెట్స్‌లో వీరిద్దరి మధ్య ఏర్పడిన అనుబంధం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. హను రాఘవపూడి విజన్‌పై ప్రభాస్‌కు బాగా నచ్చేసిందట. స్టార్ హీరో అనే ఇమేజ్ను పక్కనబెట్టి సెట్లో హను ఏది చెప్పినా ప్రభాస్ తు.చ తప్పకుండా పాటిస్తున్నట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా తన వద్దకు వచ్చే సన్నిహితులు మరియు శ్రేయోభిలాషులకు “హను ఈ సీన్ ఎంత బాగా తీశాడో చూడండి” అంటూ చాలా గర్వంగా పరిచయం చేస్తున్నారట. అలాగే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా స్పిరిట్ షూటింగ్ టైమ్ లో సందీప్ రెడ్డి వంగతోను, కల్కి 2 సెట్స్‌లో నాగ్ అశ్విన్ తోను హను రాఘవపూడి వర్క్ గురించే ప్రభాస్ ఎక్కువగా మాట్లాడుతున్నట్లు సమాచారం. అంతగా హను వర్క్ పట్ల డార్లింగ్ చాలా పాజిటివ్ గా ఉన్నాడట. ఈ క్రమంలోనే ‘ఫౌజీ’ పూర్తి కాగానే హను రాఘవపూడితో కలిసి మరో సినిమా చేయడానికి ప్రభాస్ రెడీ అవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’ నిర్మించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ‘ఫౌజీ’కి ప్రీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉన్నప్పటికీ దానికి ఇంకా చాలా సమయం పడుతుందని సమాచారం. మొత్తానికి హను-ప్రభాస్ కాంబో డిసెంబర్ 3న రాబోతున్న ఫౌజీ’తో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తారో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Reliance: “కాంపిటీషన్‌కు మేము భయపడం.. రండి చూసుకుందాం..”.. మస్క్‌కు జియో స్ట్రాంగ్ కౌంటర్..
-
Anupama Parameswaran: కేవలం డబ్బుల కోసమే సినిమాలు చేయను.. నా లక్ష్యం అదే!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వయసులోనే పతకాలు.. ప్రధాని మోడీ వ్యాఖ్యలకు వైభవ్ రియాక్షన్ వైరల్!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
ట్రెండింగ్
-
డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!