పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ జానర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలోకి చేరుకున్న ఈ ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల కానుంది. అయితే తాజాగా ప్రభాస్ ఈ సినిమాలో తన అభిమానులను అలరించేందుకు ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read : Kalki2898AD : కల్కీ సినిమా నుంచి దిపికా పదుకునే అవుట్..
ఇప్పటివరకు ఆయన యాక్షన్, మాస్ లుక్స్‌తో ఆకట్టుకున్నప్పటికీ, ఈసారి కామెడీ టైమింగ్‌తో పాటు స్టెప్స్‌లోనూ మాస్ ఎనర్జీని చూపించబోతున్నాడు. ముఖ్యంగా సినిమాలో ఒక పెప్పీ డ్యాన్స్ నెంబర్ ఉందని, ఇందులో ప్రభాస్‌ను ఎప్పుడూ చూడని విధంగా డ్యాన్స్ చేస్తూ చూడబోతున్నామని మేకర్స్ వెల్లడించారు. ఇక విజువల్స్ పరంగా కూడా ది రాజా సాబ్ ప్రేక్షకులను ఆకట్టుకోబోతుందట. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని సమాచారం. అలాగే నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ గ్లామరస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంగీతం వైపు చూస్తే థమన్ ఇప్పటికే కొన్ని పాటలను పూర్తి చేశారని, వాటిలో కొన్ని మాస్ బీట్‌లుగా నిలిచేలా డిజైన్ చేశారని చెబుతున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి. విశ్వప్రసాద్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అందరి అంచనాలను పెంచుతున్న ది రాజా సాబ్ ప్రభాస్ మళ్లీ తన మాస్ ఎంటర్టైనర్ వైపు చేరతాడని నమ్మకంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు.